పేదల సమస్యలపై నిరంతరం పోరాడేది ఎర్రజెండా మాత్రమే
– సిపిఐ( ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బండారి రవికుమార్.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో సోమవారం సీతారాం ఏచూరి ప్రాంగణంలో సిపిఐ(ఎం) పార్టీ 9వ మండల మహా సభ వంక రాములు, వీరవేని అధ్యక్షతన నిర్వహించారు. రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్ ఈసందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని కాంగ్రెస్ ఎన్ని కల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వైఫల్యం చెందాయని విమర్శించారు. నరేంద్ర మోడీ 11 ఏళ్ల పాలనలో దేశానికి రూ. లక్ష ల కోట్లు అప్పులు చేశారని విమర్శించారు. ఆకలి, దారిద్ర్యం, పేదరికం, నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. ప్రజల ఆగ్రహం నిరసనలు బయటికి రావడానికి ఇంకా ఎంతో సమయం పట్టదని ఎద్దేవా చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజావ్యతిరేక విధానాల మూలంగా ప్రజల్లో తీవ్రస్థాయిలో అసంతృప్తి నెలకొంది అన్నారు.ప్రజలు స్వచ్ఛందంగా ప్రజా పోరాటానికి వచ్చే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సిపిఐ (ఎం) ప్రజా ఉద్యమాలకు, బూర్జువా పార్టీలను నిలదీసేలా రోడ్లమీదకు వచ్చే ప్రజలకు ఎర్రజెండా నాయకత్వం వహించా లన్నారు. అడవుల నుంచి ఆదివాసులను దూరం చేయడా నికి భద్రాచలం నియోజకవర్గం సిద్ధం చేశార ని అన్నారు. పోలవరం పేరుతో విఆర్ పురం, చింతూరు, కూనవరం, భద్రాచలంలోని కొన్ని పంచాయతీలు ఆంధ్రాలో కలిపపారని అన్నారు. ఉద్యమాలను ఉదృతం కోసం పార్టీలోకి యువకు లను ఆహ్వానించి యువ రక్తం నింపాలని కార్యకర్తలకు పిలు పునిచ్చారు.మహాసభ ప్రారంభానికి ముందు సభా ప్రాంగణం లో పార్టీ జెండాను సీనియర్ నాయకులు సుందరం నరసింహా రావు ఆవిష్కరించారు. అమరులైన సున్నం రాజయ్య, గుర్రం వెంకటేశ్వరరావు, సారయ్య, చిట్టెం గురు మల్లయ్య చిత్రప టాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
– సమస్యలపై పోరాడేది సిపిఐ(ఎం)రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు
సమస్యలపై ప్రజలను సమీకరించి పోరాడేది కమ్యూనిస్టు లేనని సిపిఐ (ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావు అన్నారు. భవిష్యత్తు ఎర్రజెండా దేఅన్నారు. గతంలో ఎంపిటి సిలు, ఎంపీటీసీలు, సర్పంచ్లను, గెలుపొందామని గుర్తు చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలుపు బాటలు నడిపించి పూర్వవైభవాన్ని తీసుకురావాలని కార్యక ర్తలకు పిలుపునిచ్చారు. బూర్జువా పార్టీ నాయకులతో ప్రజా సమస్యలు పరిష్కారం కావన్నారు. కూలీ రేటు, తునికాకు బోనస్, రైతు సమస్యలపై ఉద్యమాలు చేసింది కమ్యూని స్టులే అని గుర్తు చేశారు. ఈ మహాసభలో ములుగు జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి. రెడ్డి సాంబశివ, రాజేందర్, జిల్లా కమిటీ సభ్యులు చిట్టిబాబు, మల్లారెడ్డి, రఘుపతి, గ్యానం వాసు, కుమ్మరి శీను పార్టీ కార్యకర్తలు సానుభూతిపరులు పాల్గొన్నారు.