పురుగుల మందు తాగి ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
– ములుగు ఏరియా ఆస్పత్రిలో చికిత్స
ములుగు ప్రతినిధి : పురుగుల మందు తాగి ఇంటర్మీడియట్ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ములు గు మండలం బండారుపల్లి తెలంగాణ రాష్ర్ట గురుకుల బాలు ర కాలేజీ సమీపంలో గురువారం ఉదయం జరిగింది. విద్యార్థి కుటుంబ సభ్యులు, కళాశాల ప్రిన్సిపల్ తెలిపిన వివరాలు ఈవిధంగా ఉన్నాయి. భూపాలపల్లి జిల్లా గణపురంమండలం బుద్ధారం గ్రామానికి చెందిన తుమ్మరాజేష్ బండారుపల్లి గురు కుల కాలేజీలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతు న్నాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన రాజేష్, తన అక్కయ్య బుద్ధారం గ్రామంలో మేనమామ అయిన సారంగపాణి వద్ద పెరుగుతూ విద్యాభ్యాసం చేస్తున్నాడు. ఆధార్ కార్డు అప్డేట్ చేసుకునేందుకు వెళ్తున్నానని చెప్పి బుధవారం స్కూల్ నుంచి పర్మీషన్ తీసుకొని ఇంటికి వెళ్లిన రాజేష్ గురువారం తిరిగి స్కూల్ కు వచ్చాడు. గురుకులం ప్రహరీ గోడ ఆవరణలో పురుగుల మందు తాగి చెట్టుకింద కూర్చున్న రాజేష్ ను గమనించిన విద్యార్థులు ఉపాధ్యాయు లకు సమాచారం అందించగా వెంటనే ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందు తుండగా రాజేష్ పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు డాక్టర్ వినయ్ తెలిపారు. అయితే తల్లిదండ్రులను చిన్న ప్పుడే కోల్పోవడంతో బాలుడి బాధ్యత తీసుకున్న మేన మామ సారంగపాణి అక్కయ్య పెళ్లి చేయడంతోపాటు విద్యా ర్థిని చదివిస్తుండగా మేనల్లుడి ఆత్మహత్య విషయం తెలుసు కొని తీవ్రంగా రోదించాడు.