రామప్ప దేవాలయాన్ని సందర్శించిన హైకోర్టు న్యాయమూర్తి 

Written by telangana jyothi

Published on:

రామప్ప దేవాలయాన్ని సందర్శించిన హైకోర్టు న్యాయమూర్తి 

– మహా అద్భుతమైన కట్టడం రామప్ప 

ములుగు ప్రతినిధి : వెంకటాపూర్ మండలం పాలంపేటలో గల ప్రపంచ వారసత్వ కట్టడమైన రామప్ప దేవాలయాన్ని ఆదివారము హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ దంపతులు సందర్శించారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా జడ్జి ఎస్. వి. పి.సూర్యచంద్ర కళ, సీనీయర్ సివిల్ జడ్జి కన్నయ్య లాల్, అదనపు సివిల్ జడ్జి జె.సౌఖ్య , జిల్లా ఎస్పీ శబరిష్ లు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు కోమల్లపల్లి హరీష్ శర్మ, మోహన మఠం ఉమాశంకర్లు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజ లు చేశారు. ఆలయ మహా మండపంలో వారిని శాలువాలతో సన్మానించి మహా ఆశీర్వచనం అందజేశారు. ఆలయ ప్రాము ఖ్యతను టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వివరిం చారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తి మాట్లాడుతూ రామప్ప దేవాలయం మహా అద్భుత కట్టడమని 800 సంవత్సరాల క్రితమే అత్యద్భుతమైన టెక్నాలజీ తో నిర్మించా రన్నారు. నీళ్లలో తేలే ఇటుకలు సాండ్ బాక్స్ టెక్నాలజీ గర్భగుడిలోని లైటింగ్ ప్రతిదీ అత్యద్భుతమని కొనియాడారు. ఇప్పటికంటే నాడే అడ్వాన్స్ టెక్నాలజీ ఆధునికత ఉండ డానికి అప్పటి హై హీల్స్ మినీస్ కార్డ్స్ ఇక్కడ రాయిలో సరిగమలు సూక్ష్మ రంద్రాలు నిదర్శనం అని అన్నారు. జడ్జి దంపతులు ఆలయంలోని ప్రతి శిల్పమును ఫోటోలు వీడియోలు తీసుకున్నారు. అనంతరం రామప్ప చెరువును సందర్శించి బోటింగ్ చేశారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సిహెచ్. పంచా క్షరీ, హన్మకొండ జిల్లా ప్రధాన న్యాయ మూర్తి సిహెచ్. రమేష్ బాబు, వరంగల్ జిల్లా ప్రధాన న్యాయ మూర్తి బి వి. నిర్మల గీతంబ, ఆర్. డి. ఓ వెంకటేష్, డి.ఎస్పీ రవీందర్, సి. ఐ శంకర్, బార్ అసోసియేషన్ అద్యక్షులు ఎమ్.వినయ్ కుమార్, జన రల్ సెక్రెటరీ కె. సునీల్ కుమార్, ఎస్సై సతీష్, తహసిల్దార్ సదానందం, ఆర్ఐ రమేష్, న్యాయవాదులు, పోలీసు అధి కారులు,రెవిన్యూ అధికారులు, కోర్టు సిబ్బంది, టూరిజం దేవా దాయ పురావస్తు శాఖ సిబ్బంది, తదితరులు ఉన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now