Tribal University | సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి 211 ఎకరాల 26గుంటల భూకేటాయింపు
– రూ.10.58 కోట్లు బదలాయింపు
– ఉత్తర్వులు వెలువరించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్
ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లాలో ఏర్పాటు చేసిన జాతీయ గిరిజన విశ్వవిద్యాలయ పనుల పురోగతికి ఎట్టకేలకు మోక్షం లభిస్తోంది. గత పాలకులు పదేళ్లుగా నిర్లక్ష్యం చేసిన సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి భూ కేటాయింపు, నిధులు బదలయింపు చేస్తూ తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల రాష్ర్ట మంత్రి వర్గం జాతీయ గిరిజన యూనివర్సిటీకి భూ కేటాయింపు చేస్తూ నిర్ణయం తీసుకోగా అందుకు అడుగులు పడ్డాయి. శుక్రవారం రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ భూకేటాయింపుకు సంబంధించి ఉత్తర్వులు వెలువ రించారు. ములుగులో నెలకొల్పుతున్న సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీకి గట్టమ్మ సమీపంలో 837/1 సర్వేనెంబర్లో 211ఎకరాల 26గుంటల భూమిని కేటాయిం చారు. రెవెన్యూ యాక్ట్ ప్రకారంగా భూమికి ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారంగా రెవెన్యూ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అధికా రులు భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట పునర్విభజన చట్టం ప్రకారం 2014లో ములుగులో జాతీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని కేటాయి స్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు పదేళ్లుగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లింది. రాష్ర్ట కేబినేట్ నిర్ణయం తీసుకున్న వారం రోజుల్లోనే భూమికి ధర కేటాయించి అవార్డు చేసింది. ఈ భూమికి ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారంగా ఎకరానికి రూ.5లక్షలు నిర్ణయించారు. మొత్తం 211 ఎకరాల 26గుంటల భూమికి గాను మొత్తం రూ.10.58కోట్లు అవార్డు చెల్లించారు. జిల్లా కలెక్టర్ ప్రతిపా దనల మేరకు తెలంగాణ ల్యాండ్ మేనేజ్మెంట్ అథారిటీ భూమి కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది ములుగు మండలం జాకారం సమీపంలోని యూత్ ట్రెయినిం గ్ సెంటర్ లో తాత్కాలిక తరగుతులు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోగా అడ్మీషన్ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. అయితే భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ప్రాధాన్యత సంతరించుకుం ది. సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ భవన నిర్మాణం, అడ్మినిష్ర్టేషన్, ఇతర సదుపాయాల కల్పనకు వేగంగా చర్యలు ఇక కొనసాగుతాయని స్థానికుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.