బైక్ అదుపు తప్పి తీవ్ర గాయాలు
ఏటూరునాగారం తెలంగాణ జ్యోతి : ద్విచక్ర వాహనం అదుపు తప్పి భార్యా-భర్త, పిల్లలకు తీవ్ర గాయాలయిన సంఘటన శుక్రవారం తాడ్వాయి మండలం మేడారం శివరాం సాగర్ చెరువు ప్రాంతంలో చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం… ములుగు జిల్లా తాడ్వాయి మండలం కామారం(పిటి) గ్రామానికి చెందిన కొర్నెబెల్లి నరేందర్(అటవీ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగి), అతని భార్య పిల్లలతో, ఇదే(తాడ్వాయి)మండలం బయ్యక్కపేట్ గ్రామానికి చెందిన చందా లక్ష్మీనారాయణ నే (బావమరిది) బంధువు ఇటీవల మృతి చెందాడు. ఈరోజు “బరువులు” ఉండడంతో ఈ కార్యక్రమానికి వెళ్లి, తిరిగి వస్తున్న క్రమంలో మేడారం సమీపంలోని శివరాంసాగర్ చెరువు మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పి పడిపోయింది. దీంతో కొర్నెబెల్లి నరేందర్, అతని భార్య పిల్లలు తీవ్ర గాయాల పాలయ్యారు. 108 ద్వారా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్ పట్టణానికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.