Transgender | అనాధ శవానికి అంత్యక్రియలు చేసిన ట్రాన్స్ జెండర్ గౌరీ
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: జయశంకర్ భూపా లపల్లి జిల్లా కేంద్రంలో అనాధ శవానికి అంత్యక్రియలు నిర్వ హించిన ట్రాన్స్ జెండర్ గౌరీ కి పలువురు ప్రశంసల వర్షం కురిపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సీ ఆర్ నగర్ ఇండ్ల పక్కన చిన్న పూరి గుడిసెలో నివసిస్తున్న పొనగంటి భాగ్య (55)కు ఉండడానికి ఇల్లు లేక తినడానికి తిండి లేక అలాగే ఆమెను చూసుకోవడానికి ఎవరూ కూడా లేకపోవడంతో గత కొంతకాలం నుండి అనారోగ్యంతో బాధప డుతూ ఆమె నిన్న రాత్రి చనిపోవడం జరిగింది.అక్కడ అందు బాటులో ఉన్న యువత కొందరు ఆమె నిరుపేద పరిస్థితిని . తెలియజేయడంతో వెంటనే స్పందించిన ట్రాన్స్ జెండర్ గౌరీ తన ఔదార్యాన్ని చాటారు.మరి కొంత మంది యూత్ సభ్యు లతో వారి ఇంటికి వెళ్లి ఆమె పార్తివదేహానికి నమస్కరించి ఆ అనాధ శవానికి తన సొంత ఖర్చులతో ట్రాన్స్ జెండర్ గౌరీ అంత్యక్రియలు జరిపించడం జరిగింది. అలాగే ఈ కార్యక్ర మానికి గౌరీ, అక్కడ ఉన్న తదితర సభ్యులు పాల్గొన్నారు.