కన్నాయిగూడెంలో 84వ కొమరం భీమ్ వర్ధంతి
కన్నాయిగూడెం, తెలంగాణజ్యోతి : మండల పరిది లోని ఐలాపురంలో కొమరం భీమ్ 84వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా కొమరం భీమ్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి ఆలం నాగేష్ మాట్లాడుతూ భీమ్ దాదా 1990 సం”లో జన్మించి ఆదివాసులు ఎదురుకుంటున్న సమస్యలను జీర్నించుకోలేక నిజాం ప్రభుత్వంపై ఆదివాసులకు ప్రత్యేక చట్టాలు, జిఓలు చెయ్యాలని జెల్ జెంగిల్ జెమిన్ నినాదంతో స్వయం ప్రతిపత్తి కావాలని విరోచితంగా పోరాడి మనమధ్య లో లేకపోవడం బాధకరామన్నారు. బీమ్ దాదా పోరాటం ద్వారా వచ్చిన శాసనాల ద్వారా మన ఆదివాసులు సంతో శంగా గాలి పీల్చుకుంటున్నామని అన్నారు. ఆదివా సులకు సరైన మౌలిక సౌకర్యాలు అందకపోవటం వల్ల ఆది వాసులు అభివృద్ధికి నోచుకోలేక పోతున్నామని, ముఖ్యంగా మండల జిల్లా కేంద్రాలకు వెళ్లాలంటే ఐలాపూర్ గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేక పోవటం బాధకారమన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 సం. గడుస్తున్న మా గ్రామాన్ని పట్టిం చుకునే ప్రభు త్వాలే కరువయ్యాయన్నారు. సీఎంలు, పీమ్ లు మారుతు న్నా కానీ.. మా గ్రామానికి కనీసం నడవటానికి కూడా రోడ్డు నిర్మించని ప్రభుత్వాలు ఎందుకునని, ఇకనైనా మా గ్రామాని మౌలిక సౌకర్యాలు కలిపించకుంటే భీమ్ దాదా స్ఫూర్తితో మా ఊళ్ళో మా రాజ్యం ప్రకటిస్తూ త్వరలో మహా ఉద్యమాన్ని చేపడుతామని ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్ర మంలో యూత్ అధ్యక్షులు సురేష్, లక్ష్మీనారాయ ణ, శివ కుమార్, సాగర్, వంశీ, సమ్మయ్య, రవి గ్రామస్తులు, తదిత రులు పాల్గొన్నారు.