శ్రీ సరస్వతి దేవి అవతారంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు

శ్రీ సరస్వతి దేవి అవతారంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు

– 55 రకాల పిండివంటలతో అమ్మవారికి నైవేద్యం

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : దేవీ నవ రాత్రుల సందర్భంగా 7వ రోజు శ్రీ సరస్వతి దేవి అవతారంలో కనకదుర్గమ్మ తల్లి  ప్రత్యేక పూజలు అందుకున్నారు.ములు గు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని వేపచెట్టు సెంటర్ వద్ద వెంకటాపురం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నవరాత్రి మహోత్సవాలను ప్రతిరోజు  ఘనంగా నిర్వహిస్తున్నారు. 7వ రోజు బుధవారం సరస్వతి దేవి అవతారంలో దర్శనమివ్వగా ఆర్యవైశ్య మహిళలు 55 రకాల పిండివంటలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య అమ్మ వారి పూజల అనంతరం భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. అనంతరం బడి వయసు పిల్లలకు, విద్యా ర్థులకు, పుస్తకాలు, పెన్నులను పంపిణీ చేశారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment