చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఎవరు చేయకూడదు
– సంఘ విద్రోహ శక్తులకు సహకరించకూడదు
– శాంతియుత వాతావరణంలో ఐక్యతగా దసరా ఉత్సవాలు జరుపుకోవాలి
– ఏటూరు నాగారం సిఐ అనుముల శ్రీనివాస్, ఎస్సై ఎస్కే. తాజుద్దీన్.
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : మండలం పరిధి లోని గ్రామాలలో ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో, ఐక్యతగా అందరూ కలిసి మెలిసి దసరా ఉత్సవాలు జరు పుకోవాలని ఏటూరునాగారం సిఐ అనుముల శ్రీనివాస్, ఎస్సై ఎస్కే. తాజుద్దీన్లు అన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని మాజీ మిల్టెంట్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రస్తుతం మాజీలు చేస్తున్న పని వివరాలను అడిగి తెలుసుకున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఎవరూ కూడా చేయకూడదని, సంఘ విద్రోహ శక్తులకు ఎవరూ సహకరించకూడదని, గ్రామా లలోకి ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు సంచరించినట్ల యితే తమకు సమాచారం అందించాలని సూచించారు. గ్రామాలలో ఎవరిని బెదిరింపులకు గురి చేయకూడదన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే చూస్తూ ఊరుకునేది లేదని చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరు లు పాల్గొన్నారు.