ప్రజల ఫిర్యాదుల పట్ల తక్షణమే స్పందించాలి : ఎస్పీ కిరణ్ ఖరే
భూపాలపల్లి, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: ప్రజల ఫిర్యాదు లపై తక్షణమే స్పందించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివాస్ కార్యక్రమంలో ఎస్పీ 21 మంది బాధితుల నుంచి పిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ బాధితుల సమస్యలపై చట్టరంగా విచారణ జరిపి వేగవంతంగా పరిష్కరించాలని సంబధిత సర్కిల్, సబ్ ఇన్స్ పెక్టర్ లను ఆదేశించారు.