సర్కారు బడి.. సమస్యలు జడి..!

Written by telangana jyothi

Published on:

సర్కారు బడి.. సమస్యలు జడి..!

– సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్న విద్యార్థులు

– పట్టించుకోని అధికారులు 

తెలంగాణజ్యోతి, కన్నాయిగూడెం: సర్కారీబడులు.. సమస్యలతో సతమతమవుతున్నాయి.. కన్నాయిగూడెం మండలంలోని గుర్రెవుల పాఠశాలలో చుదువుతున్న పేద విద్యా ర్థులు అనేక సమస్యల నడుమ తమ చదువులు సాగిస్తు న్నారు. ఏళ్లు గడుస్తున్నా కొన్ని లక్షలు నిధులు వెచ్చిస్తున్నా ఎక్కడ వేసిన గోంగడి అక్కడే అన్నచందంగా మారింది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో గుర్రేవుల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరిస్థితిని తెలుసుకునేందుకు తెలంగాణ దిన పత్రిక పలు పాఠశాలలను విజిట్ చేసింది. ఈ సందర్భంగా అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ము ఖ్యంగా పాఠశాలల్లో మరుగుదొడ్లు లేక విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెల కొంది. కొన్ని మరుగుదొడ్లు ఉన్న సరైన వినియోగంలో లేవు. బాత్రూం తలుపులకు తాళాలు వేశారు. నిర్వహణ సరిగా లేక పోవడంతో విద్యార్థునులు ఇబ్బందులు పడుతున్నారు.

– సమస్యల వలయంలో విద్యార్థులు

ప్రభుత్వ పాఠశాలను ప్రవేట్, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతామని పాలకులు చెబుతున్న మాటలు నీటి మూటలుగా మిగిలిపోతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుర్రేవులలో రెండు ప్రభుత్వ పాఠశాలలు ఉండటంతో జెడ్పిహెచ్ఎస్ లో 91మంది, ప్రైమ రీ స్కూల్లో 106మంది పేద మధ్య తరగతికి చెందిన విద్యా ర్థులు విద్యానభ్యసిస్తున్నారు. రెండు పాఠశాలల్లో విద్యా ర్థులకు మంచినీటి సదుపాయం లేదు. మరుగుదొడ్లు లేక విద్యార్థినులు బయటికి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. విద్యా ర్థులకు కావాల్సిన మౌలిక వసతులను కల్పిచడంలో ప్రభు త్వం పూర్తిగా విఫలమైందని, విద్యాశాఖ అధికారులకు ప్రభు త్వ పాఠశాలలపై పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థులు నర కయాతన అనుభవిస్తున్నారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

– ప్లేట్లు కడిగేందుకు పాట్లు

సర్కారు బడి.. సమస్యలు జడి..!

పాఠశాలలో విద్యార్థులకు నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. విద్యార్థులంతా సమీపంలో ఉన్న గ్రామపంచాయతీ ప్రాంగణం లోని చేతిపంపు వద్దకు లైన్లు కడుతున్నారు. మెనూ ప్రకారం ఆహార పదార్థాలు పెట్టడం లేదని, ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల చారు వడ్డిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. రక్షిత మంచి నీటి సౌకర్యం లేకపోవడంతో బయటకు వెళ్లి బోరు నీటిని తాగాల్సి వస్తోంది.

– సమస్యలతో సతమతం

సర్కారు బడి.. సమస్యలు జడి..!

 సమస్యలతో సతమతమవుతున్న విద్యార్థులకు సక్రమంగా నేర్చుకోవడానికి సరిపడా ఉపాధ్యాయులు లేరని, టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్, తెలుగు, హిందీ ఉపాధ్యాయులు లేకపోవడంతో బోర్డ్ ఎగ్జామ్ ఎలా రాయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. చదువుతో పాటు విద్యార్థి జీవితంలో భాగమైన (పీఈటీ) ఆటలు ఆడించడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, వసతులు లేక, ఉపాధ్యాయులు లేక అటు చదువుకు ఇటు ఆటలకు దూరమవుతున్నారు. పాఠశాల చుట్టూ కాంపౌండ్ వాల్ లేక పోవడంతో సెక్యూరిటీ లేకుండా పోయింది. పథకాల పేర్లు మార్చి నిధులు కేటాయించడం షరా మామూలేనని, కానీ, ఎక్కడా మార్పు వచ్చిన దాఖలాలు లేవని, గుర్రెవుల పాఠశా లలే దీనికి నిదర్శనమని అంటున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సమస్యల వలయంలో చిక్కు కొని అల్లాడుతున్న పిల్లలను దృష్టిలో ఉంచుకుని సత్వరమే పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకైచర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు కోరుతున్నారు.

– రెగ్యులర్ ఎంఈవోను నియమించాలి

సర్కారు బడి.. సమస్యలు జడి..!

మండలంలో రెగ్యూలర్ ఎంఈవోను నియమించాలని గుర్రె వుల అంబెడ్కర్ యువజన సంఘం అధ్యక్షుడు వాసంపెళ్లి నరేందర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెగ్యూలర్ ఎంఈవో లేకపోవటం వల్ల పాఠశాలలపై పర్యవేక్షణ లోపించి విద్యావ్యవస్థ కుంటుపడు తుందని, రెగ్యులర్ ఎంఈఓలు లేకపోవడంతో ఏజెన్సీ ప్రాంతా ల్లో టీచర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన సక్రమంగా లేక అందరు ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారని ఆరోపించారు. ఇప్ప టికైన అధికారులు మండలంలో రెగ్యూలర్ ఎంఈవోను నియమించి పాఠశాలలపై పర్యవేక్షణ పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే విషయమై ఇన్చార్జి ఎంఈవోను విరణ కోరగా పాఠశాలలో సమస్యలపై ఉన్నత అధికారులకు సమాచారం అందచేస్తామని, మన మన ఊరు మనబడి ద్వారా నిర్మించిన బాత్రూంలో పెండింగ్ లో ఉన్నాయని, త్వరలో వినియోగంలోకి తెస్తామని, టీచర్ పోస్టులు కూడా సర్దుబాటు చేస్తామని తెలిపారు.

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now