వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రం కు చెందిన ఎర్రం రాంబాబుకు వైద్య ఖర్చు నిమిత్తం ఆర్థిక సహాయం అంద జేశారు. ఇటీవల ఆయన అనారోగ్యంతో ఉండటంతో, పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేపించారు. వైద్య పరీక్షలు పరిశీలించిన వైద్యులు రాంబాబు కీ నోటి క్యాన్సర్ వ్యాధి వచ్చినదనీ నిర్ధారించారు. నిరుపేద వ్యక్తి అయినా ఎర్రం రాంబాబుకు వైద్య ఖర్చుల నిమిత్తం, వెంకటాపురం కు చెందిన మహాత్మ చైతన్య వేదిక అధ్యక్షులు,న్యాయవాది చిడెం రవికుమార్ సంస్థ ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తం సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. స్పందించిన మహాత్మ చైతన్య వేదిక అధ్యక్షులు రవికుమార్ ఆయన మిత్ర బ్రుందం సహాకారంతో 20 వేల రూ. అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆట్లూరి రఘురాం, బొల్లె సునీల్, బట్ట రాజేష్, కొప్పుల వినోద్, తదితరులు పాల్గొన్నారు.