మావోయిస్టు దళ సభ్యురాలు లొంగుబాటు

Written by telangana jyothi

Published on:

మావోయిస్టు దళ సభ్యురాలు లొంగుబాటు

తెలంగాణజ్యోతి, ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూ రునాగారం పోలీస్ ల ఎదుట మావోయిస్టు దళ సభ్యురాలు  లొంగిపోయింది. ఈ మేరకు ఏఎస్పి శివం ఉపాధ్యాయ విలే కరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. చతిస్గడ్ రాష్ట్రం పూజారి దళ సభ్యురాలు (ACM) పోడియం సోమిడి అలియాస్ రోని మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు నచ్చక పార్టీ నుంచి బయటకు వచ్చి లొంగిపోయిందని తెలిపారు. పూజారి కాంకెర్ పురుషం సమ్మయ్య అలియాస్ సమ్మన్న ప్రోత్బలంతో సోమిడి 2019 మిలీషియా సభ్యురాలుగా చేరిందన్నారు. ఆ తర్వాత అతని దగ్గర ఆరు నెలలు పని చేసిందని రెండవ సెంట్రల్ రీజినల్ కమాండర్ దొడ్డి పూజ అలియాస్ ప్రకాష్ ఆమె కు పార్టీ సభ్యురాలుగా పదోన్నతి కల్పించారని వివరిం చారు. అక్కడ ఆమె దలకమాండర్ సాగర్ కు గార్డుగా సంవ త్సర కాలం పాటు పని చేసిందని ఆ తర్వాత సెంట్రల్ రిజర్వ్ ఒకటవ ఫ్లాటుల్లో చేరిందని వివరించారు. 2023 ఆమె ఏరి యా కమిటీ సభ్యురాలుగా హోదా పొందినారు. సోమిడికి రూలు నాలుగు లక్షల రివార్డ్ ఉందని ఏఎస్పీ తెలిపారు. ఆయా హోదాల్లో పనిచేసినప్పుడు పలు హింసాత్మక సంఘ టనలో సహా చతిస్గడ్ రాష్ట్రం కర్రెగుటల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆమె పాల్గొంది అని తెలిపారు ఆ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు చెందారని అన్నారు. ఎన్నికలలో జాగురాగొండ పిఎస్ పరిధిలోని కుందేర్ గ్రామంలో ముగ్గురు సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ లను కాల్చి చంపిన సంఘటనలో సోమిరెడ్డి పాల్గొన్నట్లు తెలిపారు. రాష్ట్రం ధర్మారం క్యాంపుపై జరిగిన దాడి లో పెద్ద బట్టుమ్లో లోని కవురా గుట్టల్లో జరిగిన పోలీస్ కాలపుల్లో తప్పించుకుందని వివరించారు.  మావోయి స్టు పార్టీ భావాజాలంపై విరక్తితో సోమిడీ బయటికి వచ్చిందని అన్నారు. డబ్బులు వసూలు చేసి ముఖ్య నేతలకు పంచే విధానం నచ్చక జన జీవన స్రవంతిలో కలుస్తుందని ఎస్పీ తెలిపారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now