మీటరు లేనివారికి తక్కువ ధరకు కొత్త మీటరు అసిస్టెంట్ లైన్మెన్ ఆర్ కృష్ణకర్
వెంకటాపూర్, తెలంగాణ జ్యోతి : ఇల్లు లేని వారు, కొత్తగా ఇల్లు నిర్మించుకొని విద్యుత్తు మీటరు బిగించుకునే వారికి ప్రభుత్వం తీపి కబురు అందించిందని, పేదవారు సద్విని యోగం చేసుకోవాలని విద్యుత్ శాఖ అసిస్టెంట్ లైన్మెన్ ఆర్ కృష్ణకర్ కోరారు. గురువారం లక్ష్మీదేవి పేటలో ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు మీటర్లేని బిపిఎల్ (బిలో పావర్టీ లైన్) వారు 500 వాట్స్ రూ.938 తక్కువ ధరకు మీటర్ అందించే ప్రోగ్రాం నిర్వహిస్తున్నారని, ఈ ఆకాశాన్ని మీటర్లు లేని వారు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈనెల 15 వరకు మా విద్యుత్ శాఖ సిబ్బంది గ్రామాల్లో తిరిగి మీటర్ లేని పేదవారిని గుర్తిస్తారని అన్నారు. సాధారణంగా మిటర్ కోసం మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి కానీ, ప్రస్తుతం సిబ్బందికి డబ్బులు ఇస్తే నేరుగా రసీదు తీసుకునే వెసులు బాటు కల్పించినట్లు తెలిపారు. తక్కువ ధరకు మీటరు పొంది వచ్చే ప్రజా పాలనలో గృహ జ్యోతి ద్వారా విద్యుత్ సబ్సిడీ పొందవచ్చును అని అన్నారు. మీటర్ లేని ప్రతి ఒక్క పేదవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇంటి పన్ను, ఆధార్ కార్డు ఒక పాస్ ఫోటో సైజ్ ఫోటో రేషన్ కార్డు అప్లికేషన్ ఫామ్ నింపి ఇవ్వాల న్నారు. లేకుంటే విద్యుత్ చౌర్యం, చట్టం రిత్య నేరం అని పేర్కొన్నారు.