అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్బంగా రక్తదానం
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : ఏటూరునాగారం ఫారెస్ట్ డివిజన్ పరదిలో అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్బంగా అమర వీరులను స్మరించుకుంటూ ఏటూరు నాగారం బ్లడ్ డోనర్స్ సహకారం తో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అధితిగా విచ్చే సిన ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ రమేష్ రక్తదానం చేసి ప్రతి ఒక్కరు రక్తదానం చెయ్యాలని, రక్తదానం చేయటం అంటే ప్రాణదానం చేయటమే అని అన్నారు. కార్యక్రమం అనంతరం రక్తదానం చేసిన రక్తదాతలకు అందరికి పండ్లు, సర్టిఫికెట్ లు అందచేసారు. ఈ కార్యక్రమం లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లు అబ్దుల్ రెహమాన్, షకీల్ పాషా, చంద్రమౌళి, బాలరాజు, మాళవి షీతల్, డిప్యుటీ రేంజ్ ఆఫీసర్ లు నరేందర్, అప్స రన్నిసా, కొటేశ్వర్, శోభన్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు, బేస్ క్యాంప్ సిబ్బంది,ఏటూరునాగారం బ్లడ్ డోనర్స్ సయ్యద్ వహీద్, మెరుగు హరీష్, ఖాజా పాషా, గండపల్లి సుకేష్, మహమ్మద్ మున్నా, నాగవత్ కిరణ్, ఖలీల్, అఖిల్ యాదవ్, సాయి, అందెకర్ నగేష్, రాజేందర్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.