పొక్సో చట్టం పై అవగాహన పెంచుకోవాలి

పొక్సో చట్టం పై అవగాహన పెంచుకోవాలి

– భరోసా కేంద్రం కౌన్సిలర్ అనూష

– బిట్స్ లో విద్యార్థులకు అవగాహన

ములుగుప్రతినిధి:విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచు కోవాలని, ముఖ్యంగా బాలికలు పోక్సో లాంటి చట్టం గురించి తెలుసుకోవాలని భరోసా సెంటర్ కౌన్సిలర్ అనూష, కో ఆర్డి నేటర్ తిరుమల సూచించారు. మంగళవారం ములుగులోని బిట్స్ ఉన్నత పాఠశాలలో ప్రిన్సిపల్ కొలగాని రజినీకాంత్ అధ్యక్షతన జరిగిన అవగాహన కార్యక్రమంలో వారు మాట్లా డారు. బాలికలు ఆత్మస్థైర్యంతో ఉండాలని అన్నారు. తమ పై జరిగే మానసిక, భౌతిక దాడులకు తమను తాము రక్షించు కోవడానికి అవగాహన పెంచుకోవాలని సూచించారు. తల్లి దండ్రులు సైతం నిత్యం పర్యవేక్షిస్తూ భరోసా కల్పించాల న్నారు. పొక్సొ యాక్ట్ 2012 పై ఎక్కువ అవగాహన కలిగి ఉండాలని, గుడ్ టచ్, బ్యాడ్ టచ్పై విద్యార్థులకు వివరిం చారు. ఈ కార్య క్రమంలో పాఠశాల ఉపాద్యాయులు, విద్యా ర్థులు పాల్గొన్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment