డబల్ బెడ్ రూమ్ కాలనీ వద్ద క్లీన్ అండ్ గ్రీన్
– చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ శ్రమదానం.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం బీ.సీ మర్రిగూడెం గ్రామ పంచా యతీ పరిధిలోని డబల్ బెడ్ రూమ్ కాలని వద్ద, మురుగు నీరు, కాలవలు, అపరిశుభ్రతతో దోమల విజృంభణ కారణం గా విష జ్వరాలు సంభవిస్తున్నాయని, ములుగు జిల్లా దిశ అధ్యక్షురాలు పెనుమచ్చ మాదురి విషయాన్ని చేయూత కు తెలిపారు. విషయం తెలుసుకున్న చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు చిడెం సాయి ప్రకాష్ డబల్ బెడ్ రూమ్ ఏరియా వీదుల వారిగా మిత్రుల సహకారంతో బ్లీచింగ్ చల్లారు. గ్రామపంచాయతీ, వైద్య శాఖ, ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడంతో చేయూత సంస్థ ముందుకు వచ్చి శానిటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండర్ చిడెం సాయి ప్రకాష్, సాయి తేజ,ములుగు జిల్లా దిశ అధ్యక్షురాలు పెనుమచ్చ మాధురి రావుల నరేంద్ర కుమార్, రాధాకృష్ణ, యాసం రమేష్, చెన్నం నరేష్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డబల్ బెడ్ రూమ్ కాలనీ నివాసితులు చేయూత స్వచ్ఛంద సంస్థ శ్రమదానాన్ని అభినందించారు.