పిహెచ్ సి లోపనిచేయని సీబీపీ యంత్రం
– తీవ్ర ఇబ్బందుల్లో రోగులు
కన్నాయిగూడెం, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా కన్నా యిగూడెం పిహెచ్ సి ఆసుపత్రిలో సమస్యలు రాజ్యమేలు తున్నాయి. ఇక్కడ రోగులకు అందించాల్సిన మందులు నిండు కున్నాయి. ల్యాబ్ లో సీబీపీ, పని చేయడం లేదు. దీందో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐలాపురం, చిట్యాల, భూపతిపురం,పలు గ్రామాల ప్రజలు నిత్యం వైద్యం కోసం అధిక సంఖ్యలో రోగులు వస్తుంటారు. ల్యాబ్ లో కంప్లిట్ బ్లడ్ పిక్చర్ యంత్రం పని చేయకపోవడంతో రోగులకు ప్లీట్ లెట్స్, డెంగ్యూ తదితర పరీక్షలు గతవారం నుండి నిలిచిపోయాయి.దీంతో డాక్టర్లే బయట ప్రవేట్ ల్యాబ్ లకు పంపిస్తున్నారు.ఒకవైపు జిల్లా అధికారులు వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంటే మరోవైపు దీనికి విరుద్ధంగా ఉంది. సీబీపీ వినియోగంలో లేకపోవడంతో బయట ల్యాబ్ లో చేయించడానికి పైసలు లేవని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వైద్యాధికారి వివరణ
హైదరాబాద్ టెక్నీషియన్ కు సమాచారం అదించాము. హెల్త్ ప్రాబ్లమ్ ఉంది రాలేను అని చెప్పారని డాక్టర్ అభినవ్ అన్నారు. నేడు ఏటూరునాగారంలో రిపేర్ చేస్తున్నామని పేర్కొన్నారు.