పశువులకు వైద్యం అందించాలి – సిబ్బందిని నియమించాలి

Written by telangana jyothi

Published on:

పశువులకు వైద్యం అందించాలి – సిబ్బందిని నియమించాలి

– రైతులు, పెంపకం దారులు వినతి. 

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి :  ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో గ్రామీణ పశు వైద్యశాలలో సిబ్బంది, డాక్టర్ల పోస్టులు సంవత్సరాల తరబడి ఖాళీగా ఉండటంతో పశువులకు సకాలంలో వైద్యం అందక మృత్యువాత పడుతున్నాయని రైతులు పశు పెంపకం దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం, శీతాకాలం, వేసవి లో వచ్చే సీజనల్ వ్యాదులను ముందస్తుగానే పశు సంవర్దక శాఖ అధికారులు, సిబ్బంది గ్రామాల్లో పశువుల యజమానుల ఇళ్లకు వెళ్లి టీకాలు వేయటం గత కొన్నేళ్లుగా జరుగుతున్నది. అయితే సిబ్బంది లేకపోవడంతో సీజనల్గా వచ్చే వ్యాధులకు టీకాలు వేసే నాధుడు లేకపోవడంతో వేలాది రూ. విలువైన పశువులు, మేకలు, గొర్రెలు మూగజీ వాలు మృత్యువాత పడుతున్నాయి. వెంకటాపురం మండ లంలో ఆలుబాక, నూగూరు గ్రామాల్లోని పశువైద్యశాల కు సంవత్సరాల తరబడి డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ పశువుల డాక్టర్ పోస్టు ను ఆఫ్ గ్రేడ్ చేసి ఏ.డీ.ఏ పోస్టును భర్తీ చేశారు. ఏ డి ఏ గా వెంకటాపురం పశు వైద్య శాలలో వెటర్నరీ సేవలు అందిస్తున్నారు . అలాగే నూగూరు పశువైద్యశాల కు భవనం లేకపోవడంతో మూడేళ్ల క్రితం బర్ల గూడెం పంచాయతీలోని చిరుత పల్లి గ్రామంలో ఖాళీగా ఉన్న వసతి గృహం భవనంలో తాత్కాలిక పశువై ద్యశాల ఏర్పాటు చేశారు. నూగూరు పశు వైద్యశాల పరిధిలో సుమారు 17 గ్రామాలకు పైగా రైతులు తమ పశువులను, మూగజీవాలను పాడి గేదెలను ఈ వైద్యశాల పరిధిలోకి చేర్చారు. అయితే ఇక్కడ కూడా డాక్టర్ పోస్టుతో పాటు పూర్తి స్థాయి సిబ్బంది ని భర్తీ చేయలేదు. అలాగే మండలంలోని ఉఫ్ఫేడు గొల్లగూడెం చుట్టుపక్కల గ్రామాలలో వేలాది మేకలు, గొర్రెలు తో పాటు పాడి గేదెలు దుక్కుటేడ్లతో, వ్యవసాయ పాడి పరిశ్రమ గ్రామా లుగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతంలో మూగ జీవాలకు ఏమన్నా వ్యాధులు వస్తే వైద్యం చేసే నాధుడు లేకపోవడంతో, కళ్ళముందే వేలాది రూ. విలువైన పశుసంపద మృత్యువాత పడుతున్నది. ఇప్పటికైనా ములుగు జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖ ఉన్నత అధికారులు  వెంటనే స్పందించి వెంకటాపురం, వాజేడు మండలాల్లో ఖాళీగా ఉన్న పశు సంవర్థక డాక్టర్ పోస్టులు, సిబ్బంది పోస్టులు వెంటనే భర్తీ చేయాలని పశు వైద్యశాలలకు సొంత భవనాలు నిర్మించాలని పశు సంపద కాపాడాలని ఆయా రైతులు ముక్తకంఠంతో కలెక్టర్ కు విజ్ఞప్తి చేస్తున్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now