చిట్ ఫండ్ కంపెనీ ఎదుట దంపతులు ఆత్మ హత్యా యత్నం

Written by telangana jyothi

Published on:

చిట్ ఫండ్ కంపెనీ ఎదుట దంపతులు ఆత్మ హత్యా యత్నం 

– షేర్ హోల్డర్ తన వాటా డబ్బులు ఇవ్వడంలేదని ఆరోపణలు

ములుగుప్రతినిధి, తెలంగాణజ్యోతి:ములుగు జిల్లా కేంద్రం లో ఓ ప్రైవేటు చిట్ ఫండ్ కంపెనీ ఎదుట దంపతులు ఆత్మ హత్యా యత్నానికి పాల్పడ్డారు. తమకు పార్టరనర్ నుంచి డబ్బులు రావాలని, తమకు డబ్బులు రాకుండా ఇబ్బందు లకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాలు ఈవిధంగా ఉన్నాయి. ములుగులో లహరి ప్రైవేటు చిట్ ఫండ్ కంపెనీలో నూనె భిక్షపతితో కలిసి తాను ఏడేళ్ల క్రితం పెట్టుబడి పెట్టినట్లు మండంలోని జాకారం గ్రామానికి చెందిన తోట నరేందర్ వెల్లడించారు. అయితే ఇటీవల పార్టనర్ షిప్ విషయంలో వివాదాలు రావడంతో సీఏ సమక్షంలో లెక్కలు జరిపామని, తనకు రూ.95లక్షల నగదుతోపాటు రెండు ప్లాట్లు కూడా రావాల్సి ఉందన్నారు. అయితే నగదు, ప్లాట్లు ఇవ్వడంలో తనను పార్టనర్ నూనె భిక్షపతి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ కంపెనీ ఎదుట తోట నరేందర్ లావణ్య దంపతు లిద్ధరూ పెట్రోల్ ఒంటిపై పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన స్థానికులు వారిని వారించారు. విషయం తెలుసుకున్న ఎస్సై వెంకటేశ్వర్ రావు దంపతులి ద్దరినీ పోలీస్ స్టేషన్కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రతీ సమస్యకు చావు పరిష్కారం కాదని, చట్టబద్ధంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు బాధితులు పేర్కొన్నారు. ఈ విషయంపై ఎస్సైని వివరణ కోరగా సంఘటన జరిగింది నిజమేనని, ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ దంపతులిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చామని పేర్కొన్నారు.

Leave a comment