రైతు జేఏసీ ఆధ్వర్యంలో నిరసన సెగ
ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి : ఏటూరునాగారం మండల కేంద్రంలోని చిన్నబోయినపల్లి గ్రామంలో తెలంగాణ రైతుసంఘం మండల కమిటీ రుణమాఫీ ఫై సమావేశం నిర్వహించి జాతీయ రహదారి పై నిరసన వ్యక్తం చేసారు. ఈ సందర్బంగా రైతు సంఘం అధ్యక్షుడు సారయ్య మాట్లా డుతు ఏ రైతుకైన ఎంత రుణ బకాయి ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీని వర్తింప చేయాలని తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ అధ్యక్షుడు వాడకాపురం సారయ్య ప్రభు త్వాన్ని కోరారు.ఈ సందర్బంగా రైతు సంఘం అధ్యక్షుడు సారయ్య మాట్లా డుతు ఏ రైతుకైన ఎంత రుణ బకాయి ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీని వర్తింప చేయాలని తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ అధ్యక్షుడు వాడకాపురం సారయ్య ప్రభు త్వాన్ని కోరారు. ఈ సందర్భంగా రైతు అధ్యక్షులు మాట్లాడు తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు ఎలాంటి నిబంధనలు లేని రుణమాఫీ ఇచ్చి ఎన్నికల తర్వాత రైతుల రుణమాఫీ పై లేనిపోని నిబంధనను విధించి రైతులలో గందరగోళం సృష్టిస్తున్నారని అన్నారు. రైతులను బ్యాంకుల చుట్టూ, రైతు వేదికల చుట్టూ తిప్పించుచున్నారని రైతు నాయకులు ఆవేదన వ్యక్తం చేషారు. 2 లక్షలకు పైబడి ఉన్న రైతులకు ఆపై ఎంత మిత్తి ఉన్నా చెల్లించాలనే మాటను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని, ప్రస్తుతం కరీఫ్ పంటలు పెట్టుబడి సమయం అయినందున పెట్టు బడుల కోసం రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల వద్ద అప్పులు తీసుకోవడం కోసం నానా తంటాలు పడుతున్నా రన్నారు. ప్రస్తుత ఉన్న పరిస్థితుల్లో రైతులు వడ్డీలు చెల్లించ లేక పోతున్నారన్నారు. ప్రభుత్వం వడ్డీలు చెల్లిస్తేనే మాఫీ వర్తిస్తుందని నిబంధన పెట్టడం సరికాదన్నారు. రుణమాఫీ పేరుతో రైతాంగాన్ని మోసం చేయాలని చూస్తే సహించేది లేదన్నారు. 2 లక్షలకు పైబడి ఉన్న రైతులకు మిత్తి తో సంబంధం లేకుండా రెండు లక్షల రూపాయలను రైతు ఖాతాల్లో జమ చేసి రైతును రుణవిముక్తి నుండి కాపాడాలని, రెండు లక్షలకు మించి ఆపై ఉన్న వడ్డీ భారాన్ని చెల్లించాలని ప్రభుత్వం విధించిన నిబంధనను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతు సంఘం ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళనను చేయక తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ అధ్యక్షుడు సారయ్య, సిద్ధ బోయిన రాంబాబు, షేక్ పతే మహమ్మద్, యాకూబ్, నాసర్, చేల నర్సింగరావు, అక్బర్, మెట్టి శ్రీను, షేక్ కాశీం, రైతులు పాల్గొన్నారు.