బంగ్లాదేశ్ ఘటనకు నిరసనగా కాటారం బంద్ విజయవంతం
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: బంగ్లాదేశ్ లో హిందు వులపై దాడి, హిందూ దేవాలయం ధ్వంసం ఘటనలకు నిరస నగా మంగళవారం కాటారం మండలం బందుకు అఖిలపక్షం పిలుపునిచ్చింది. భారతీయ జనతా పార్టీ, విశ్వహిందూ పరిష త్, ఆర్ఎస్ఎస్, హిందూ సంఘాల ఐక్యవేదిక, అఖిలపక్ష కమిటీల ఆధ్వర్యంలో మంగళవారం బందుకు పిలుపు ఇచ్చా రు. ఈ నేపద్యంలో కాటారం మండల కేంద్రంలోని దుకాణాలు ,పండ్ల దుకాణాలు, బట్టల దుకాణాలు కిరాణా దుకాణాలు, వ్యాపార వాణిజ్య సముదాయాలు హోటల్లు, బందులో స్వచ్చందంగా పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకు లు మల్లారెడ్డి, బొమ్మన భాస్కర్ రెడ్డి, దుర్గం తిరుపతి, బొంత లరవి, రాజేష్, బొడ్డు ఆశయ్య తదితరులు పాల్గొన్నారు.