వాజేడు మండలం లో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. అన్నా తమ్ములకు, అక్కా, చెల్లెలు రాఖీలు కట్టి స్వీట్స్ తినిపించి హరతులు ఇచ్చారు. ఘణంగా రాఖీ వేడుకలు జరుపుకున్నారు. రాఖీలు కట్టిన ఆడబిడ్డలకు చీరె లు, మిఠాయిలు ఇచ్చి ప్రేమను చాటుకున్నారు. రాఖి పౌర్ణమి సందర్భంగా అనేక రాఖి దుకాణాలు, బట్టల దుకాణాలు ముఖ్యంగా మిఠాయి దుకాణాలు కొనుగోలుదారులతో కిట కిట లాడాయి.