వెంకటాపురం యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి హోరాహోరీ పోటీ

Written by telangana jyothi

Published on:

వెంకటాపురం యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి హోరాహోరీ పోటీ

ఆగస్టు 14 నుండి సెప్టెంబర్ 14 వరకు యాప్ ద్వారా ఓటింగ్

వెంకటాపురం నూగూరు,   తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి హోరాహోరీగా పోటీ నెలకొంది. ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో యాప్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ  ఆగస్టు 14వ తేదీ నుండి ప్రారంభమై, సెప్టెంబర్ 14వ తేదీ వరకు  ఓటింగ్లో పాల్గొనవచ్చునని రాష్ర యువజన కాంగ్రెస్ కమిటీ ఉత్తర్వులు జారి చేసింది. ఈ మేరకు వెంకటాపురం మండలంలో ధనపనేని శివకుమార్, చిట్టెం సాయి కృష్ణ లు యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీకి హోరా హోరిగా పడుతున్నారు. వారి అభిమానులు, మిత్ర బృందాలు పార్టీ క్యాడర్ తదితర మార్గాల ద్వారా వెంకటాపురం మండలంలో 18 నుండి 35 సంవత్సరాలు మధ్య వయసు కలిగిన వారిని తమ ఓటర్ కార్డు, ఆధార్ కార్డు ద్వారా ఇండియన్ యూత్ కాంగ్రెస్ యాప్ లో ఓటింగ్ చేసే విధంగా గ్రామాల్లో విస్తృతం గా పర్యటనలు జరుపుతున్నారు. వెంకటాపురం యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి, తొలుత నలుగురు యువకులు రంగంలో నిలిచినట్లు వార్తలు వెలువడ్డాయి. అనంతరం అనూహ్య రీతిలో ఇరువురు యువకులు పోటీ నుండి విత్ డ్రా అయినట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాత్రం ఇరువురి యువకులు మాత్రమే ముఖాముఖి పోటీలో ఉన్నారని అంటున్నారు. సెప్టెంబర్ 14వ తేదీన యాప్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ పూర్తయి న తర్వాత, అఖిల భారత యువజన కాంగ్రెస్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ కమిటీల ఆధ్వర్యంలో, కౌంటింగ్ ప్రక్రియ ప్రకటించి, విజయం సాధించిన అభ్యర్ధి పేరును ప్రకటిస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఎవరు వెంకటాపురం మండల యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవిని గెలుపొందుతారో అని ఉత్కంఠ నెలకొంది.

Leave a comment