కల్వర్టు నిర్మించండి మహాప్రభో..!
– శివాలయం వీధి ప్రజల వినతి.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా మండల కేంద్రమైన వెంకటాపురం పట్టణంలో నిత్యం రద్దీగా ఉండే శివాలయం వీధి, రైస్ మిల్ పక్కన లోపాటికి వెళ్లే సి.సి. రోడ్డు వద్ద కల్వర్టు లేకపోవడంతో వరద నీరు అంతా రోడ్డుపై నుండి ప్రవహిస్తూ బురద మయంతో గోతులుగా మారింది. ఇటీవల రాష్ట్రమంత్రి సీతక్క ఈ రోడ్డు గుండా ప్రయాణించే సమయంలో వెంకటాపురం మేజర్ పంచాయతీ అధికారులు మంత్రి కార్ల కాన్వాయ్ బురదలో దిగబడకుండా ఉండేందుకు, శివాలయం పూజారి ఇంటి నిర్మాణం కోసం పోసిన మెటల్ ను బురదలో హడావుడి గా పరిచారు. అయితే ప్రముఖులకు ఒక న్యాయం, సామాన్య ప్రజలకు ఒక న్యాయమా అంటూ ప్రజలు వెంకటాపురం మేజర్ పంచాయతీ అధికారులపై దుమ్మేత్తి పోస్తు, శాపనార్థాలు పెడుతున్నారు. రైస్ మిల్ పక్కనుండి లోపల కు వెళ్లే మల్లాపురం రోడ్డు వద్ద, మోకాలి లోతు బురదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంవత్సరాల తరబడి కల్వర్టు నిర్మించమని పలుమార్లు విన్నవించిన పట్టించుకోని నాధుడే లేరని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. వెంకటాపు రం పట్టణ ప్రధాన వీధుల నుండి సుమారు దశాబ్దాం క్రితం రోడ్డు కు ఇరువైపులా రెండు కిలోమీటర్ల కు పైగా డ్రైనేజీని రోడ్లు భవనాల శాఖ నిర్మించింది. అయితే ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న ఈ డ్రైనేజీలు కొండా ప్రవహించే మురుగు నీరు శివాలయం వద్ద కల్వర్టు కలవట్ల నుండి శివాలయం వెనకవైపుగా మల్లాపురం రోడ్ సైడ్ డ్రైనేజీ గుండా ప్రవహించి, మురుగు నీరు, చెత్తా చెదారం అంతా కంకల వాగులో కలుస్తున్నది. శివాలయం వద్ద వరకు వచ్చి ఆంజనేయస్వామి మందిరం వెనుక కల్వర్టు గుండా మల్లాపురం రోడ్డు డ్రైనేజీలో ప్రవహించి కంకల వాగులో మురుగునీరు కలుస్తున్నది. శ్రీ ఆంజనేయ స్వామి మందిరం వెనుక ఎల్ షేప్ లో కల్వర్టు లో కలపటంతో పాటు మల్లాపురం రోడ్డుకు డైవర్ట్ చేశారు. అయితే సీ.సీ రోడ్డు నిర్మాణం నిమిత్తం శివాలయం వీధిలో నిర్మించిన డ్రైనేజీ నిర్వహణ లేక, పూడికతీత లేక పూర్తిగా చెత్తతో నిండి పోయింది. రాక పోకలు సాగించే ప్రజలు శివాలయం వీధి, బురదలో సర్కస్ ఫీట్లు తో ద్విచక్ర వాహనాలు, ఆటోలు రాకపోకలు సాగిస్తున్నాయి. వెంకటాపురం మేజర్ పంచా యతీ అధికారులు వెంటనే స్పందించి సిమెంటు తూరలతో తాత్కాలికంగా అయినా కల్వర్టు నిర్మించాలని, శివాలయం వీధి ప్రజలు, వెంకటాపురం పట్టణ ప్రజలు పత్రికా ముఖంగా జిల్లా పంచాయతీ అధికారి, మండల పంచాయతీ అధికారి, మేజర్ పంచాయతీ అధికారులకు పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నారు.