ఆదివాసీ, గిరిజనుల ట్రైబల్ డిక్లరేషన్ ను వెంటనే అమలు చేయాలి
– కలెక్టర్ కార్యాలయం ముందు గిరిజన
– మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం
– ఎస్టి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్
ములుగు ప్రతినిది : భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా రాష్ట్ర ఆదేశాల మేరకు ములుగు జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ముందు గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు గండపల్లి సత్యం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ములుగు బిజెపి జిల్లా అధ్యక్షులు సిరికొండ బలరాం, ఎస్టి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేవెళ్ల ట్రైబల్ డిక్లరేషన్ లో భాగంగా ఆదివాసి గిరిజనులకు హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్నా కూడా నేటి వరకు కూడా ఆదివాసి గిరిజనుల హామీలను నెరవేర్చకపోవడం సిగ్గుచేటన్నారు. అంబేద్కర్ అభయ హస్తం, (గిరిజన బంధు) అనే పథకాల ద్వారా ఎస్సీ ఎస్టీలకు 12 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తానన్న కాంగ్రెస్ ప్రభుత్వం నేటికీ ఆ హామీలను నీటి మీద మూటలాగా వదిలారన్నారు. గిరిజనులకు ఇందిరమ్మ ఇళ్లు, లేదా ఇంటి స్థలం కేటాయిస్తానని చెప్పి నేటికీ కూడా ఆ మాటలు నెరవేర్చకపోవడం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. మోసపూరిత హామీలతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ మోసపూరిత హామీలు నెరవేర్చని వాగ్దానాలతో పరిపాలిస్తున్నదన్నారు. జనాభా ప్రకారం ప్రభుత్వ కాంట్రాక్టు పద్ధతిలో ప్రైవేటు రంగ సంస్థల్లో పనిచేస్తున్న వారికి 12 శాతం రిజర్వేషన్ ను అమలు చేస్తామని, నెరవేర్చని ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. ఆర్టికల్ 338 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడిగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల కమిషన్ను విడదీసి ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమ్మక్క సారలమ్మ గిరిజన అభివృద్ధి పథకం కింద ప్రతి గిరిజన గూడాలు, తండాలకు ప్రతి ఏటా 25 లక్షల కోట్లు అభివృద్ధి పథకం ఏమైందన్నారు. గిరిజనుల అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తానన్న హామీ ఎక్కడికి వెళ్లిందని అన్నారు. ఇప్పటికైనా ఆదివాసి, గిరిజనులకు ప్రతి ఒక్కరికి పోడు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చేవెళ్ల డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని గిరిజనులకు తోడ్పాటు అభివృద్ధి అయ్యే విధంగా ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ కలెక్టర్ ఆఫీసులో ముట్టడి చేసి ఆందోళన కార్యక్రమాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శీలమంతుల రవీంద్ర చారి, జిల్లా ఉపాధ్యక్షులు ఆడప బిక్షపతి, కిసాన్ మోర్చావ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాడి రామరాజు, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు రాయించు నాగరాజు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు వవిరాల జనార్ధన్, ములుగు మండల అధ్యక్షులు గాదం కుమారస్వామి, జిల్లా నాయకులు గంగిశెట్టి శ్రీనివాస్, భైకని మహేందర్, ఎస్టి మోర్చా జిల్లా నాయకులు అజ్మీర్ కిషోర్ నాయక్, బెల్లంకొండ వినోద్, భూక్య దేవ్ సింగ్, జిల్లా నాయకులు కళ్లెపు ప్రవీణ్, చక్రధర్, ఇనుముల మహేష్, సాగర్, సిద్దు, పవన్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.