తుపాకుల మోతతో దద్దరిల్లిన గుండాల అడవులు
– అడవుల్లో కొనసాగుతున్న కూంబింగ్.
భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, వరంగల్ జిల్లా సరిహద్దు జిల్లాలో మావోయిస్టులకు పోలీసులకు కాల్పు లు జరిగినట్లు సమాచారం… ఈ కాల్పుల ఘటనలో దళ సభ్యుడు నల్లమారి అశోక్ అలియాస్ విజేందర్ సన్నాఫ్ వీరస్వామి (30) గా గుర్తించారు. కొన్ని సంవత్సరాల తర్వా త, గుండాల అడవుల్లో తుపాకులు మోత మోగడంతో ఏజెన్సీ గ్రామాల, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ కాల్పుల ఘటనలో మావోయిస్టులు ఎంతమంది ఉన్నా రని, పోలీసులు కూంబింగ్ చేస్తున్నారు. గుండాల మండలం దామరతోగు గ్రామంలో ఈ కాల్పులు జరగడంతో, పినపాక, గుండాల, మణుగూరు, పోలీసులతో పాటు, ములుగు జిల్లాలోని మంగపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, పోలీసు లు అప్రమత్తమయ్యారు. ఎంతమంది మావోయిస్టులు ఈ కాల్పుల్లో పాల్గొన్నారనేది పోలీసులు అంచనా వేస్తున్నారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో మావోయిస్టులు ఎంతమంది ఉన్నారని అడవులను జల్లెడ పడుతున్నారు. మావోయి స్టులు-కూంబింగ్ పోలీసులకు మధ్య భీకరంగా కాల్పులు జరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.