ఏసీబీకి చిక్కిన పరకాల సబ్ రిజిస్ట్రార్
పరకాల : హన్మకొండ జిల్లా పరకాల సబ్ రిజిస్ట్రార్ కార్యాల యంలో అవినీతి నిరోధకశాఖ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పరకాల సబ్ రిజిస్ట్రార్ సునీత రూ.80వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. పరకాల మున్సిపాలిటీ సీతారాంపురానికి చెంది న 9గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు లంచం డిమాం డ్ చేయగా.. మధ్యవర్తి ద్వారా లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు సమాచారం.