అత్యవసర వర్ష పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధం 

Written by telangana jyothi

Published on:

అత్యవసర వర్ష పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధం 

–  జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

– చెరువులు, కుంటల పై నిరంతరం నిఘా ఉంచాలి

– ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

-వర్షాల ప్రభావం వల్ల జిల్లాలో తీసుకోవలసిన జాగ్రత్తలపై జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిం చిన జిల్లా కలెక్టర్,పాల్గొన్న ఎమ్మెల్యే,జిల్లా ఎస్పీ

భూపాలపల్లి జిల్లాప్రతినిధి, తెలంగాణ జ్యోతి:అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. సోమవారం ఐడిఓసి కార్యాలయపు మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా ఎస్పీ కిరణ్ ఖరేతో కలిసి వర్షాల ప్రభావం వల్ల జిల్లాలో తీసుకోవలసిన జాగ్రత్తలపై జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వర్షపాతం అధికంగా ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టామని తెలిపారు. ఎలాంటి సమస్యలైనా ఎదురుకోవడానికి జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉందని అన్ని మండలాలలో అధి కారులు అత్యవసర సేవలను అందించడానికి అందుబా టులో ఉన్నారని అన్నారు. గత నాలుగు రోజులుగా కురుస్తు న్న వర్షాలకు వాగులు, ఉదృతంగా ప్రవహిస్తున్నాయని, కాళేశ్వరం వద్ద గోదావరి నది మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తుందని అన్నారు. మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులలో అన్ని గేట్లు ఎత్తి నీటిని కిందకి వదులుతున్నట్లు తెలిపారు. గ్రామాలలో చెరువులు కుంటలు నిండి కొన్ని చోట్ల మత్తడి పోస్తున్నాయని, చెరువుల వద్ద నిరంతర పటిష్ఠ నిఘా ఉంచా లని తెలిపారు. చెరువుల నీటి మట్టం, కట్ట పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఇరిగేషన్ అధికారులు నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. గ్రామా లలో వరద ఉధృతికి కొట్టుకుపోయిన రోడ్లు, కల్వర్టులు యుద్ద ప్రతిపదికన మరమ్మత్తులు చేపట్టాలని ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. దెబ్బతిన్న ఇండ్లపై తహసీల్దార్లు, ఎంపిడివోలు, గ్రామ పంచాయతి కార్యదర్శులు నివేదికలు ఇవ్వాలని, అదే విధంగా పంట పొలాలపై వ్యవసాయ అధికారులు నివేదికలు అందచేయాలని ఆదేశించారు. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అన్ని ప్రభుత్వ విభాగాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాలలో ఎలాంటి సమస్యలు ఉన్న వెంటనే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. మండలాలలో తహసీల్దార్లు వర్షం కారణంగా కూలిపోయిన ఇళ్ల, ఇసుక మేటలు వేసిన పంట పొలాల వివరాల నివేదిక అందజేయాలని తెలిపారు. పంచాయితీ కార్యదర్శులు గ్రామ పంచాయితీ సిబ్బంది పారిశుధ్య పనులు చేపట్టి గ్రామాలలో ప్రజలు రోగాల బారిన పడకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వర్షానికి వంగిన, విరిగిపోయిన విద్యుత్ స్థంబాలను గుర్తించి వెంటనే మార్చే విధంగా చర్యలు చేపట్టాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. కొన్ని చోట్ల వ్యవసాయ క్షేత్రాల లో కిందకు వేలాడుతున్న కరెంటు వైర్లు ఉన్నాయని వాటన్నిటిని సరి చేయాలని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకు తరలించేందుకు సిద్ధంగా చేయాలని అత్యవసర పరిస్థితిలో ప్రజలు కలక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నంబర్లు 9030632608, 18004251123 కు కాల్ చేయాలని అన్నారు.

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ…

చెరువులు, కుంటల పరిరక్షణకు ఇరిగేషన్ అధికారులు నిరంతరంల్ నిఘా ఉంచాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనా రాయణ రావు అన్నారు. నియోజకవర్గంలో గత సంవత్సరం జరిగిన పరిస్థితి పునరావృతం కాకుండా ఇరిగేషన్ అధికా రులు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని తెలిపారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు పూర్తిగా నిండి జలకల సంతరించుకున్నాయని అన్నారు. చెరువు కట్టలకు గండ్లు ఏర్పడకుండా ఇరిగిషన్ అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు. గండ్లు పడితే అడ్డు వేసేందుకు ఇసుక బస్తాలు సిద్దంచేసుకొని అన్ని చెరువుల వద్ద ఏర్పాటు చేయాలని అన్నారు. చెరువులు పూర్తిగా నిండి మత్తళ్లు పోస్తున్నాయని పేర్కొన్నారు. చెరువు కట్టల పరిరక్షణకు మత్తడి నీరు వెళ్ళడానికి రెండు ఫీట్లు తొలగించైనా చెరువు కట్టలను రక్షించాలని తెలిపారు. గత సంవత్సరం నియోజక వర్గంలో 124 చెరువులు తెగి వరదలు సంభవించి ప్రాణ నష్టం, అస్థి నష్టం వాటిల్లిందని, 28 కోట్లతో 124 చెరువుల మరమ్మత్తులు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. వరదలను దృష్టిలో ఉంచుకొని మోరంచపల్లి వాగు వెంబడి చెట్లు తొలగించాలని జన్ కో అధికారులను ఆదేశించామని తెలిపారు. మోరంచ వాగు ప్రవాహం అధికంగా ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని గ్రామాలలో తెగిపోయిన రోడ్లు, కల్వర్టులకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేసి రవాణా సేవలు పునరుద్దరణ చేయాలని ఆదేశించారు. గ్రామాలలో ప్రజలకు వరదల పట్ల అవగాహన కల్పించాలని అవసరమైతే తరలించడానికి పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని తెలిపారు. ప్రజలు బయటకు రాకూడదని అన్నారు. మత్స్య కారులు చేపల వేటకు వెళ్లరాదని తెలిపారు. చెరువుల మత్తళ్లకు ఇనుప జాలీలు ఏర్పాటు చేస్తే తక్షణమే తొలగించా లని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఎమ్మెల్యే తెలిపారు.

 జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే మాట్లాడుతూ…

జిల్లాలోని అన్ని మండలాల్లో పోలీసు అధికారులను అప్రమత్తం చేయడం జరిగిందనీ అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో లో లెవల్ వంతెనల వద్ద ప్రమాదం హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రమాదాలు జరగ కుండా రాకపోకలు నిలిచిపోయిన ప్రాంతాలలో సిబ్బందిని నియమించి పటిష్ఠ పహారా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి నిత్యం గస్తీ తిరుగుతూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నా మని అత్యవసర సమయాలలో 100 నంబర్లకు ఫోన్ చేస్తే తగు చర్యలు చేపడతామని తెలిపారు. అత్యవసర సమయా ల్లో ఉపయోగ పడే వాటర్ బోట్, శిక్షణ పొందిన సిబ్బంది అందుబాటులో ఉంచమని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిపిఓ నారాయణరావు, డిఆర్డీఓ నరేష్, ఇరిగేషన్ ఈ ఈ లు వెంకటేశ్వర్లు, తిరుపతి, యాదగిరి, బిట్లా తదితరులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now