Mulugu : జాతీయ రహదారి 163 పై ఘోర రోడ్డు ప్రమాదం
– అక్కడికక్కడే ముగ్గురి మృతి,ఇద్దరికీ తీవ్ర గాయాలు
ఏటూరునాగారం,తెలంగాణజ్యోతి : ములుగు జిల్లా ఏటూ రునాగారం మండల కేంద్రంలో 163 జాతీయ రహదారిపై శనివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏటూరునాగారం వైపు వస్తున్న లారీ ఆటోను డీ కొట్టగా ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా, అంబులెన్స్ లో ఏటూరు నాగారం సామాజిక ఆసుపత్రికి తరలించారు. ఆటో వాజేడు మండలానికి చెందినదిగా, ప్రమాద స్థలంలోని స్థానికులు వివరాలు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.