ముప్పనపల్లిలో కేజీబీవీ బాలికల విద్యాలయాన్ని  ప్రారంభించిన మంత్రి సీతక్క

ముప్పనపల్లిలో కేజీబీవీ బాలికల విద్యాలయాన్ని  ప్రారంభించిన మంత్రి సీతక్క

కన్నాయిగూడెం,తెలంగాణజ్యోతి:మండలంలోని  ముప్పన పల్లిలో నూతనంగా 3.05 లక్షలతో నిర్మించిన కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి  దనసరి అనసూయ (సీతక్క)  హాజరై నూతన భవనాన్ని ప్రారంభించారు. ఇటీవల జరిగిన పదోవతరగతి పరీక్షల్లో ఉత్త్తీర్ణత సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసారు. ప్రతి ఒక్క విద్యార్థిని మంచి క్రమశిక్షణతో చదువుకొని కన్న తల్లిదండ్రులకు, చదువు చెప్పిన గురువు లకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సీతక్క విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ టిఎస్ దివకర, అడిషనల్ కలెక్టర్, పంచాయతీరాజ్ శాఖ రెవెన్యూ శాఖ డిపార్ట్మెంట్ మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు, మహిళలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment