Latest News
మా రెండేళ్ల పాలనకు ఈ ఫలితాలే నిదర్శనం : సీఎం రేవంత్ రెడ్డి... సేవతీర్థ్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ... కేసీఆర్‌ను కూడా ప్రజలు ఓడించారు: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్... సృష్టి సంతానోత్పత్తి కుంభకోణంలో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ... గొర్రెలు కాదు..! గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ట్రక్కుల్లో తరలింపు : హెడ్ మాస్టర్ సస్పెండ్... మున్సిపల్ ఫలితాల ఊపుతో... మార్చిలో పరిషత్‌ వార్‌!... ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి...    

విద్యార్థులకు మాదకద్రవ్యాల నిరోధకతపై అవగాహన

On: March 6, 2026 9:46 PM

విద్యార్థులకు మాదకద్రవ్యాల నిరోధకతపై అవగాహన

రాయినిగూడెం ఆశ్రమ హై స్కూల్‌లో కార్యక్రమం

ములుగు, మార్చి 6 (తెలంగాణ జ్యోతి): తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ హై స్కూల్ రాయినిగూడెంలో విద్యార్థులకు మాదకద్రవ్యాల నిరోధకతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మాదకద్రవ్యాల నిరోధక చర్యలపై అవగాహన కల్పించేందుకు ములుగు ఎస్పీ కేకన్ సుధీర్ రామనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ములుగు ఎస్సై యు. ఉపేందర్ మాట్లాడుతూ విద్యార్థులు మాదకద్రవ్యాలు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. తమతోటి విద్యార్థుల్లో ఎవరైనా మాదకద్రవ్యాలకు అలవాటు పడినట్లు గమనిస్తే పోలీసులకు లేదా స్కూల్‌లో ఏర్పాటు చేసిన ఆంటీ డ్రగ్ కమిటీ, ప్రిన్సిపాల్‌కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. విద్యార్థి జీవితం అమూల్యమని, మంచి లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడితేనే భవిష్యత్తులో ఉన్నత స్థానాలు సాధించగలరని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై చంద్రశేఖర్, స్కూల్ ప్రిన్సిపల్ హీరు నాయక్, అధ్యాపక బృందం, ములుగు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!