మహా కుంభాభిషేక మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలి
– అధికారులు టీము వర్కుగా పనిచేసి విజయవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.
కాళేశ్వరం ఫిబ్రవరి 5, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం దేవస్థానంలో మహాకుంభాభి షేకం ఏర్పాట్లను ముఖ్యంగా గోపురాల పరంజా పనులను మెట్ల మార్గం ద్వారా పైకి ఎక్కి పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ . ఆలయ పరిసరాలలో జరుగుతున్న పనులను కలెక్టర్ కు ఆలయ ఈవో ఎస్ మహేష్ వివరించారు.కుంభాభిషేకానికి మూడు రోజుల్లో దేవాలయంలో జరిగే పూజాల వివరాలను ఉప ప్రధాన అర్చకులు పనకంటి ఫణీంద్ర శర్మ కలెక్టర్ తెలిపారు.ఈ సందర్భంగా ఈఓ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం మహా కుంభాభిషేకం గోడపత్రికలు ఆవిష్కరించారు. ఈ సందర్భం గా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కాళేశ్వరం దేవస్థానంలో ఫిబ్రవరి 7, 8, 9 తేదీల్లో జరిగే మహా కుంభాభిషేకం కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. వచ్చే భక్తులు మెచ్చేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దాదాపు 42 సంవత్సరాలు తరువాత జరుగుతున్న కార్యక్ర మాన్ని చాలా ప్రాధాన్యత ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మొదటి కార్యక్రమం అని, భవిష్యత్తులో ఇతర దేవాలయాల్లో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడా నికి అవకాశం ఉందని విజయవంతం చేసి ఆదర్శంగా నిలవాలని తెలిపారు. ఈ మహోత్స వాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమిష్టి కృషి చేయాలని సూచించారు. భక్తులు, యంత్రాంగం పరస్పర సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు. దేవాలయ ప్రధాన గోపురం ముందు భక్తులకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భక్తులు కార్యక్రమం వీక్షించేందుకు వీలుగా ఎల్ ఈ డి స్క్రీన్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. భక్తులు రద్దీ నియంత్రణ, క్యూ పాటించడానికి వీలుగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, దేవాలయ శాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు, డిప్యూటీ కమిషనర్ సుమలత, డిపిఓ నారాయణరావు, ఇరిగేషన్ ఈఈ తిరుపతి, పిఆర్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, డిపిఆర్వో శ్రీనివాస్, కాటారం డిఎస్పీ రామిరెడ్డి, మండల ప్రత్యేక అధికారి వీరభద్రయ్య, తహసిల్దార్ ప్రహ్లాద్ రాథోడ్, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, దేవస్థానం ఈఓ మహేష్, ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణ మూర్తి శర్మ తదితరులు పాల్గొన్నారు.