పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలి
– జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
-రైతు భరోసా, రేషన్ కార్డుల ఎంపిక పై పరిశీలన
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : రైతు భరోసా, రేషన్ కార్డుల ఎంపిక పారదర్శకంగా జరగాలని జయశంకర్ భూపాల పల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు. శుక్రవారం భూపాల పల్లి జిల్లా కాటారం మండలంలోని కొత్తపల్లి, మేడిపల్లి గ్రామ పంచాయతీలో జరుగుతున్న రైతు భరోసా, రేషన్ కార్డు ఎంపిక ను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. అధికారులు నిర్వహిస్తున్న సర్వేపై పాటించవలసిన నిబంధనలను వివరిం చారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు రైతు భరోసాను, సాగు చేసే భూమికే ఇచ్చే ఉద్దేశంతో ఉన్నట్లు, రేషన్ కార్డులు కూడా అర్హత ఉన్న కుటుంబాలకే రేషన్ కార్డులు అందే విధంగా చూడాలని తెలిపారు. మృతి చెందిన వ్యక్తుల పేర్లను రేషన్ కార్డులో తొలగించాలని, కార్డు లేని వారికి ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అడ్డూరి బాబు, డిప్యూటీ తాసిల్దార్ మార్క రామ్మోహన్ గౌడ్, మండల పంచాయతీ అధికారి వీర స్వామి, వ్యవసాయ శాఖ అధికారి, సిబ్బంది పాల్గొన్నారు.