దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు నరసింహ
తెలంగాణ జ్యోతి, ములుగు ప్రతినిధి : జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘ భవనంలో దొడ్డి కొమరయ్య సినిమా మీటింగు ఏర్పాటు చేసి ములుగు జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికకు చిత్రదర్శకులు ఎం సేనాపతి అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు గోరిగే నరసింహ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మనమందరి స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం ప్రాణ త్యాగం చేసిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కోమరయ్య జీవిత చరిత్రపై సినిమా రావడం ఎంతో సంతోషదగ్గ విషయం అన్నారు. తన మరణంతో 3 వేల గ్రామాలను విముక్తి చేసిన వీరుడని, పేద ప్రజలకు భూమి పంపకానికి కారణం అయిన యోధుడని, గ్రామాల్లో వెట్టిచాకిరి నిర్మూలించిన దీరుడని, గ్రామాల్లో మతసామరస్యాన్ని నెలకొల్పిన మహావీరుడు అన్నారు. గొప్ప చరిత్ర కలిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు స్వాతంత్ర సమరయోధుడు దొడ్డి కొమరయ్య నేడు కాలగర్భంలో కలిసిపోయాడని అందుకే ఏ ప్రజల స్వేచ్ఛ స్వతంత్రల కోసం పోరాడుతూ దొడ్డి కొమరయ్య మరణించాడో అదే ప్రజల చేత ఈ చిత్రాన్ని నిర్మించాలని దర్శకుడు ఏం సేనాపతి సంకల్పించుకోవడం చాలా గొప్ప విషయం అన్నారు. ప్రపంచ సినీ చరిత్రలో ఇది ఒక సంచలనం అని తెలిపారు. ఒక వీరుని జీవిత చరిత్రను ప్రజలే సినిమాగా తీయడం ఎక్కడ జరుగలేదని అన్నారు. ఈ విధంగా దొడ్డి కొమరయ్యకి 77 ఏళ్లలో రాణి గౌరవం, గుర్తింపు ఈ సినిమాతో వస్తుందని అన్నారు. దొడ్డి కొమురయ్య సినిమా నిర్మాణ కమిటీ ములుగు జిల్లా చైర్మన్ గా ముంజల బిక్షపతి గౌడ్, వైస్ చైర్మన్ గా అన్నమోహన్ కుమార్, కన్వీనర్ గా రాజ్ కుమార్, కో కన్వీనర్ గా గూడెల్లి ఓదెలు, కమిటీ సభ్యులుగా బాలుడు ఐలయ్య, ఈ కల ధనుంజయ్, ముదురు గొల్ల సదానందం, కోరే రవి, ఎంఎం మునీర్ ఖాన్, జంపాల సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో జంపాల రవీందర్, వేల్పుగొండ రఘువీర్, గుంటి దేవేందర్, గొర్రె కుంట హుస్సేన్, కుమార్ యాదవ్, పెండ్యాల ప్రభాకర్ అన్ని వర్గాలకు చెందిన కుల సంఘ నాయకులు, ప్రజాసంఘ నాయకులు పాల్గొన్నారు.
1 thought on “దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక”