ఏకన్నగూడెం వద్ద గ్రామస్తుల రాస్తారోకో
– ప్రధాన రహదారిపై స్తంభించిన రాకపోకలు.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : వెంకటాపురం చర్ల ప్రధాన రహదారి ఎదిర పంచాయతీ ఏకన్నగూడెం గ్రామ స్తులు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహిం చారు. రహదారి మరమ్మత్తులు పేరుతో మెటల్ పరిచి బీ.టీ వేయకుండా నిర్లక్ష్యంగా కాంట్రాక్టర్ వదిలేశారని, బీటీ వేయక పోవడంతో వచ్చి పోయే ఇసుక లారీలు ఇతర వాహనాల కారణంగా దుమ్ము, దూళి లేచి శ్వాసకోశ వ్యాధులతో పాటు, ప్రధాన రహదారి కి ఇరువైపులు ఉన్న పంట పొలాలు , మిర్చి పంట ఇతర పంటలపై దుమ్ము ధూళి పడి పంట నష్టం జరుగు తుందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు భవనాల శాఖ అధికారులు పట్టించుకోవటం లేదని సోమవారం ఉదయం గ్రామస్తులు యావత్తు రోడ్డుపై బైఠాయించారు. దీంతో చర్ల వైపు నుండి ఇటువైపు, ఇటువైపు నుండి అటువైపు వెళ్లే వాహనాలు వందల సంఖ్యలో నిలిచిపోయాయి. సంవత్సరం పైగా అయిన రోడ్లు భవనాల శాఖ అధికారులు పట్టించుకోవటం లేదని, ప్రజా ప్రతినిధులకు మొర పెట్టుకున్న, సెల్ఫోన్ ద్వారా ఆర్ అండ్ బి అధికారులతో మాట్లాడి తర్వాత వదిలేస్తున్నారని ,ఈ ప్రకారంగా సుమారు 16 నెలలు పైగా అయిన రోడ్డు పై బీటి వేయకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లు భవనాల శాఖ బడా కాంట్రాక్టర్ తో ప్రజా ప్రతినిధులకు, పార్టీలకు చందాల సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, దీంతో ప్రజలు ఇబ్బందులు పడు తున్న పట్టించుకోవటం లేదని శాపనార్థాలు పెడుతూ, దుమ్మెత్తి పోస్తున్నారు.