ఆలుబాకలో పెద్దపులి సంచారం
– బయోంధోళనలో గ్రామస్తులు.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఆలుబాక భోదాపురం ప్రాంతాల్లో ఆదివారం అర్ధరాత్రి పెద్ద పులి సంచరించినట్లు గ్రామస్తులు ద్వారా సమాచారం. గ్రామ శివారు వీధులలో పులి సంచరించినట్లు పాదముద్రల ద్వారా గ్రామస్తులు గుర్తించారు. అయితే కుక్కను చంపి నోట కరుచు కొని ఈడ్చుకు వెళ్లినట్లు ఆనవాళ్లు ఉన్నట్లు గ్రామస్తులు చెబుతు న్నారు. అయితే ఆలుబాక బోదాపురం గ్రామ శివారు వీధులలో సంచరించింది పెద్దపులా లేక చిరుత పులా అనే విషయంపై అటవీశాఖ అధికారులు పాద ముద్రలను సేకరిస్తున్నారు. ఆలు బాక సమీపంలోనే గోదావరి నది ఉండటం, ఇటీవల ఈ ప్రాంతం లో పెద్దపులి గోదావరి దాటి పెళ్లినట్లు పాద ముద్రల ద్వారా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. రెండు మూడు వారాల తర్వాత మరల ఆలుబాక, బోదాపురం గ్రామ శివారులలో ఊర్లో కి పులి సంచరించినట్లు పాదముద్రలు కనపడ టంతో గ్రామస్తు లు ఆంధోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఫారెస్ట్ అధి కారులు పాద ముద్రలను ఫోటోలను, వీడియో లను తీసీ నిపుణుల ద్వారా సంచరించింది పెద్దపులా లేక చిరుత పులా అనే విషయంపై క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఈ విషయంపై ఫారెస్ట్ ఉన్నతాధికారులకు గ్రామస్తులు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.