అంబులెన్స్ లోనే పురుడుపోసిన 108 టెక్నిషియన్.
తెలంగాణ జ్యోతి, వెంకటాపురం నూగూరు ప్రతినిధి : ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన కేసరి సారమ్మకు పురిటి నొప్పులు రావడంతో వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రాగా అక్కడ పరీక్షించి మెరుగైన వైద్యం కోసం ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రికి తరలించారు. ఏటూరునాగారం ప్రసూతి వైద్య నిపుణులు పరీక్షించి సారమ్మకు డయాబెటిస్ (షుగర్) ఉండి ఉమ్మనీరు పోతున్నందున మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అంబులెన్స్ లో ములుగు ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్తున్న 108 సిబ్బంది జవహర్ నగర్ టోల్ ప్లాజా దగ్గరికి చేరుకోగానే సారమ్మకు పురిటినొప్పులు ఎక్కువ అవగా అంబులెన్స్ ని పక్కకు ఆపి ఈఎంటి శివలింగం ప్రసాద్ ఈఆర్సిపి డాక్టర్ దుర్గాప్రసాద్ సూచనలతో సుఖ ప్రసవం కాగా మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లి బిడ్డలను ములుగు జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. 108 ఈఎంటి టెక్నిషియన్ కు గర్భిణి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
1 thought on “అంబులెన్స్ లోనే పురుడుపోసిన 108 టెక్నిషియన్.”