సీఎం కేసీఆర్ షెడ్యూల్ ఖరారు…

సీఎం కేసీఆర్ షెడ్యూల్ ఖరారు…

  • నవంబర్ 9వ తేదీన నామినేషన్

డెస్క్ : ఈనెల అక్టోబర్ 15వ తేదీన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పాటించాల్సిన నియమ నిబంధనలు తదితర అంశాలపై అభ్యర్థులకు వివరిస్తారు. అదేరోజు అభ్యర్థులకు పార్టీ బీ ఫారాలను అందజేస్తారు. అనంతరం పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తారు. అక్టోబర్ 15, 16, 17, 18 తేదీల్లో జిల్లాలు, నియోజకవర్గాల్లో వరుసగా నాలుగు రోజులు పర్యటించనున్నారు. నవంబర్ 9న రెండు చోట్ల సీఎం కేసీఆర్ నామినేషన్ దాఖలు చేస్తారు. అంతేకాదు.. 15వ తేదీనే హైద్రాబాద్ నుంచి బయలుదేరి, హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ పాల్గొంటారు. అక్టోబర్ 16న జనగామ, భువనగిరి నియోజకవర్గాల కేంద్రాలు, 17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రాలు, అక్టోబర్ 18న జడ్చర్ల, మేడ్చల్ నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించబోయే బహిరంగ సభల్లో సీఎం పాల్గొంటారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment