వైఎస్ఆర్టిపి కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు
- జిల్లా అధ్యక్షులు అప్పం కిషన్
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: భూపాలపల్లి, మంథని నియోజకవర్గంలలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులని ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని వైఎస్ఆర్టీపీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్ అన్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని కార్యకర్తలు పూర్తిస్థాయిలో కాంగ్రెస్ తో కలిసి పనిచేసి అత్యధిక మెజారిటీతో అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కెసిఆర్ అవినీతి పాలనను అంతం చేయాలని, ప్రజలు పడుతున్న ఇబ్బందుల నుండి బయటికి రావాలని ఆకాంక్షించారు. నిరుద్యోగులు , రైతుల ఆత్మహత్యలు ఆగాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్, సంతోష్, తిరుపతి రావు, కృష్ణ, సంపత్ తదితరులు పాల్గొన్నారు.