వెంకటాపురం పోలీస్ సర్కిల్లో విస్తృతంగా వాహనాల తనిఖీలు.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని వాజేడు, పేరూరు, వెంకటాపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రధాన రహదారులపై గురువారం ఉదయం నుండి విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. వాజేడు పిఎస్ పరిధిలోని మండపాక, వెంకటాపు రం పిఎస్ పరిధిలోని కొత్తపల్లి క్రాస్ రోడ్ వద్ద, పేరూరు పిఎస్ పరిదిలో కడేకల్ వద్ద ఆయా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్లు ఆధ్వ ర్యంలో వచ్చే పోయే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి అపరిచిత వ్యక్తుల సమాచారాన్ని ఈ సంద ర్భంగా రాబట్టారు. పి ఎల్ జి ఏ వారోత్సవాల సందర్భంగా మావోయిస్టు లు తమ ఉనికిని కాపాడుకునేందుకు ఏదో ఒక ప్రాంతంలో, దుశ్చ ర్యలకు పాల్పడే అవకాశం ఉందని గూడచారి సమాచారంతో, పోలీసులు అప్రమత్త మయ్యారు. ఇప్పటికే అదనపు పోలీస్ బల గాలతో కూంబింగ్ ఆపరేషన్ తో పాటు, అడవులను ప్రత్యేక బలగా లు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ను జల్లెడ పడుతున్నారు.