వాడ బలిజ సేవా సంఘం ఆత్మీయ సమ్మేళన సమావేశం. 

Written by telangana jyothi

Published on:

వాడ బలిజ సేవా సంఘం ఆత్మీయ సమ్మేళన సమావేశం. 

వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం మొరవానిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని అబ్బాయి గూడెం గ్రామంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర వాడ బలిజ సేవా సంఘం రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో, ఆత్మీయ సమ్మేళన సభ నిర్వహించారు. వాడబలిజ కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడారు.రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని గోదావరి పుట్టిన దగ్గర నుండి సముద్రంలో కలిసేంత వరకు గోదావరికి ఇరువైపులా అత్యధికంగా వాడ బలిజ కులస్తులు ఉన్నప్పటికీ ప్రతి ఎన్నికల్లో మన ఓట్లు ఉపయోగించుకుంటూ ఎమ్మెల్యేలుగా గెలిచి మా గురించి కానీ ,మా సంఘం గురించి గానీ అసెంబ్లీలో ఏ ఒక్క ఎమ్మెల్యే ఏ రోజు మాట్లాడిన దాఖలాలు లేవని విమర్శించారు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ మా కుల సంఘం ఉందనే విషయం రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో లేకపోవడం బాధాకరమని అన్నారు. ప్రజా ప్రతినిధిగా ఎన్నుకోబడిన వాళ్లు మా వాడ బలిజలు ఎదురుకుంటున్న సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాలని కోరారు. రాజకీయ పార్టీలు వాడ బలిజ కులస్తులను ఏ పార్టీ గుర్తించలేదని ఈనెల నవంబర్ 30 వ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వాడ బలిజ సేవా సంఘం తరుపున  తమ డిమాండ్లను తీరుస్తామని హామీ ఇచ్చిన పార్టీలకే మా మద్దతు ఉంటుందని రాష్ట్ర నాయకత్వం తీర్మానం చేశారు.మా యొక్క డిమాండ్లు….1వ డిమాండ్ వెంకటాపురం, వాజేడు ,చర్ల మూడు మండలాల కలిపి వెంకటాపురంలో వాడబలిజ మత్స్యకార గురుకులం పాఠశాల ఏర్పాటు చేయాలని,  కన్నాయిగూడెం, మంగపేట, ఏటూరునాగారం మండలాలకు కలిపి ఏటూరునాగారంలొ వాడబలిజ మత్స్యకార గురుకులం స్కూల్ ఏర్పాటు, రెండవ డిమాండ్  బ్రిటిష్ కాలం నుంచి వందలాది సంవత్సరాలుగా ఈ గోదావరి ప్రత్యేక ప్రాంతంలో నివసిస్తున్న సాంప్రదాయ మత్స్యకారులమైన మాకు ప్రభుత్వం గుర్తించి ఏజెన్సీ ప్రాంతంలో ఎస్టీ సోదరులతో సమానంగా చెరువుల, కుంటలు ,గోదావరి లొ వేసే చేప పిల్లలపై ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీ రాయితీలను వాడ బలిజ కులస్తులకు కేటాయించాలని డిమాండ్ చేశారు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అ టువంటి బీసీ బంధులో వాడబలిజ కులస్తులకు కూడా చేర్చాలి . ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్న డబల్ బెడ్ రూమ్ ఇల్లు నిరుపేద కుటుంబాలైన వాడ బలిజ కులస్తులకు ప్రత్యేక కోట కింద విడుదల చేయాల ని సమావేశ ఏకంగా తీర్మానించి డిమాండ్ చేసింది. కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్య సలహాదారు తోట మల్లికార్జున రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు గగ్గూరి రమణయ్య, రాష్ట్ర యువ నాయకులు డర్ర దామోదర్, రాష్ట్ర మాజీ అధ్యక్షులు చింతూరు గాంధీ, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మరియు ఉప సర్పం చ్ లు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now