యూత్ నేతలతో దుద్దిల్ల శీను బాబు ముచ్చట్లు
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: శాసనసభ సాధారణ ఎన్నికల నేపథ్యంలో మహాదేవపూర్ మండల కేంద్రం లో యువజన కాంగ్రెస్ నేతలతో మంథని శాసనసభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు సహోదరుడు శ్రీపాదరావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శీను బాబు మాట ముచ్చట నిర్వహించారు. ఆదివారం తెల్లవారు జామున కాటారం మండలం తన్వాడలో గ్రామస్తులతో రోడ్డుపైననే ముచ్చటించారు. అనంతరం మాహదేవపూర్ మండలంలోని బొమ్మపూర్ క్రాస్ వద్ద శ్రీనుబాబు యూత్ కాంగ్రెస్ నేతలతో ముచ్చటించారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ పనితీరుపై ఆయన యూత్ కాంగ్రెస్ నేతలతో సమీక్షించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో నెరవేర్చనున్న ఆరు గ్యారెంటీ పథకాల కార్డులను ఇంటింటికి తిరుగుతూ ఓటర్లకు అవగాహన కల్పించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గెలుపునకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని కోరారు. అంతకుముందు ఆయన ధన్వాడ స్వగ్రామంలో బస్టాండ్ వద్ద కల్వర్టుపై కూర్చుని గ్రామస్తులతో ఎన్నికల గురించి చర్చించారు. మహాదేవపూర్ లో యూత్ కాంగ్రెస్ నాయకులు మేసినేని రవిచంద్ర, తన్నీరు రాఘవేంద్ర, దహగం సంతోష్, కడార్ల నాగరాజు, నెన్నేల గట్టయ్య , పెండ్యాల సునీల్, కలీం, కృష్ణమోహన్, భాస్కర్ వెంకటరమణ తదితరులు ఉన్నారు.