బిఆర్ఎస్ లో భారీగా మైనార్టీల చేరిక
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: భారత రాష్ట్ర సమితి పార్టీలో భారీగా మైనార్టీలు చేరారు. సోమవారం రాజగృహలో మంథని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, పెద్దపెల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకులు జక్కు రాకేష్ ఆధ్వర్యంలో కాటారం మండలానికి చెందిన మైనార్టీలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మహమ్మద్ జమీర్ ఖాన్, మహమ్మద్ ముబీన్ బేగ్, మహమ్మద్ సమీర్ షేక్ తాజుద్దీన్, షేక్ తౌశిఫ్, మహమ్మద్ సుల్తాన్, మహమ్మద్ అక్మల్, మహమ్మద్ అస్లాం సద్దాం, చోటే మహబూబ్, చాంద్ పాషా తదితరులు బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. మంథని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పుట్ట మధుకర్ గెలుపునకు కృషి చేస్తామని ఆ పార్టీలో చేరిన మైనార్టీలు వెల్లడించారు.