బిఆర్ఎస్ నుండి కాంగ్రె స్ లో చేరిక.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు లో నిర్వహించి న కాంగ్రెస్ పార్టీ సభలో పలువురు వివిధ పార్టీలకు చెందిన వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు . ఆదే గ్రామానికి చెందిన పాపారావు మరియు కుమ్మరి మోహన్ రావు ఆధ్వర్యంలో, బిఆర్ఎస్ పార్టీ నుండి నేతకానీ ఎస్సీ వాడాలో 40 కుటుంబాలు వారు కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఎంఎల్ఎ పోదాం విరయ్య ,మాజీ ్ఎంఎల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ సమక్ష్యం లో కాంగ్రే స్ లో చేరారు. భద్రాచలం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే వీరయ్య గెలుపు కోసం తమ కార్యకర్తలు తమ అభిమానులతో గ్రామాల్లో హస్తం గుర్తుకే ఓటు వేయమని ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహించి, ఎమ్మెల్యే వీరయ్య ను గెలిపించుకుంటామని, ఈ సందర్భంగా పార్టీలో చేరిన నేతలు హర్షద్వారాల మధ్య ప్రకటించారు.
1 thought on “బిఆర్ఎస్ నుండి కాంగ్రె స్ లో చేరిక. ”