పేదల పక్షాన పోరాడేది ఎర్రజెండానే…   

Written by telangana jyothi

Published on:

పేదల పక్షాన పోరాడేది ఎర్రజెండానే…                    

  • సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి బీ.రవికుమార్

వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : పేదల పక్షాన వారి సమస్యల పరిష్కారo కోసం నిరంతరం పోరాడేది ఎర్రజెండా పార్టీ అని ప్రశ్నించే గొంతును అసెంబ్లీ కి పంపించాలని, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్ అన్నారు.సోమవారం ములుగు జిల్లా వెంకటాపురం సీపీఐ(ఎం) కార్యాలయంలో జోన్ కన్వీనర్లు,శాఖ కార్యదర్శులు, ముఖ్యకార్య కర్తల సమావేశం వంకా రాములు అధ్యక్షత న జరిగింది.ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) భద్రాచలం నియోజక వర్గ అభ్యర్థి కారం పుల్లయ్య గెలుపుకు ప్రతి కార్య కర్త కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ పథకాల కమీషన్లు దళితబందు, లబ్దిదారుల ఎంపికలో జరిగిన అవకతవకలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బండారు రవికుమార్ మాట్లాడుతూ.. అధికార బీ. ఆర్.ఎస్ ,ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టిలు పేదలు,దళితులను విడిచి పెట్టలేదన్నారు. దళిత బంధు పేరుతో లక్షల రూపాయలు దండు కున్నారని విమర్శించారు. తీసుకున్న కమీషన్లు దళిత కుటుంబాలకు చెల్లించాకే, మండలాలల్లో పర్యటన చేయాలని ఎద్దేవాచేశారు. బీసీ బందులో కమీషన్లు ఇచ్చిన వారినే బీఆర్ ఎస్ పార్టీ నాయకులు ఎంపిక చేశారని అన్నారు.ఈ ఎంపికలో అర్హులైన నిరుపేదలకు అన్యాయం జరిగిందని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే పొందేం వీరయ్య తో భద్రాచలం నియోజక వర్గానికి ఒరిగింది ఎంలేదన్నారు.ప్రభుత్వ పథకాల కళ్యాణ లక్ష్మీ, ఇతర పదకాల చెక్కులు పంపిణీ తప్ప గ్రామాల్లో ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలేదన్నారు.గతంలో కేంద్రంలో,రాష్ట్రం లో అధికారం లో ఉన్న కాంగ్రేస్ పార్టీ ఏజన్సీకి చేసిన అభివృద్ధి శూన్యం అన్నారు.ఆ కరికీ ఏజన్సీ అభి వృద్ధి నిధులు సైతం మైదాన ప్రాంతాలకు తరలించుకు వెళ్లారన్నారు.అప్పుడు ఎర్రజెండా ప్రజా ప్రతినిధులు ఉండటం తో పోరాడి అ నిధులను వెనక్కు తెచుకున్నామని గుర్తు చేశారు.భద్రాచలం బీ ఆర్ఎస్ పార్టీ వల్ల ఏజన్సీకి ఒరిగింది ఏమిటని ప్రశ్నించారు. ఎంపీ గా, ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓడి పోయిన తెల్లం వెంకట్రావు భద్రాచలం లో విలాస వంతమైన ఆసుపత్రి భవనాలు నిర్మించి, వైద్యం చేసుకుంటున్నారని అన్నారు. పేదల పక్షాన పోరాడేదే ఎర్రజెండా సైనికులు మాత్రమే అన్నారు.అందుకే ప్రశ్నించే గొంతులను అసెంబ్లీ కి పంపాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు సూ డి కృష్ణా రెడ్డి మాట్లాడారు. మండల కార్యదర్శి కుమ్మరి శ్రీను ,జిల్లా కమిటీ సభ్యులు గ్యానం వాసు గఫుర్ ,మండల నాయకులు కట్ల చారి,ఆదినారాయణ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now