నాయకులు, కార్యకర్తలు, బూత్ ఇంచార్జ్ ల శ్రమ మరువరానిది : ఎమ్మెల్సీ తాతా మధు.

Written by telangana jyothi

Published on:

నాయకులు, కార్యకర్తలు, బూత్ ఇంచార్జ్ ల శ్రమ మరువరానిది : ఎమ్మెల్సీ తాతా మధు.  

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి ప్రతినిధి :  ములుగు జిల్లా వాజేడు మండలంలో మండ ల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పెనుమల్లు రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ ఎమ్మెల్సీ, ఎన్నికల బిసిఎమ్ ఇన్చార్జ్ తాతా మధుసూదన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ‌వాజేడు మండల ఎన్నికల సమన్వయకర్త బోదెబోయిన బుచ్చయ్య, బూత్ కమిటీ సభ్యులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ తెల్లం వెంకట్రావు విజయాన్ని ఆకాంక్షిస్తూ బిఆర్ఎస్ పార్టీ ‌నాయకులు, కార్యకర్తలు శ్రమిస్తున్న తీరును మొదటిగా ఆయన అభినందించారు. వెంకటాపురం, వాజేడు మండలంలో తన స్వార్థ రాజకీయాల కోసం ఈ ప్రాంతాన్ని, ప్రజలను తాకట్టు పెట్టి రాజకీయ ప్యాకేజీల కోసం కట్టుబడ్డ బడా నేతలను  ఓట్ల ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపు నిచ్చారు .బిఆర్ఎస్ పార్టీ నుండి అన్ని రకాలుగా లబ్ధి పొందిన బడా నేతలు ప్యాకేజీ ల కోసమే పార్టీలు మారారనీ ధ్వజ మెత్తారు.ముఖ్యమంత్రి కేసీఆర్  ఆశీర్వాదంతో పోటీ చేస్తున్న బిఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు గారి విజయం తద్యమని తెలిపారు. ఎవరెన్ని కుట్రలు చేసినా భద్రాచలం ప్రజల ఆశీర్వాదంతో బిఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని తెలిపారు.వాజేడు మండలంలోని అన్ని పోలింగ్ బూతులలో భారీ మెజార్టీ తెచ్చే విధంగా ప్రతి కార్యకర్త విధిగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.మండల స్థాయిలో జరుగుతున్న ఇంటింటి ప్రచారం గురించి, మరియు ఎన్నికల ప్రచారంలో మండలంలోని ప్రజలు ఆదరిస్తున్న తీరు ను కార్యకర్తలను, నాయకులు ను అడిగి తెలుసుకున్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్  సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం భద్రాచలం నియోజకవర్గంలోని, ప్రతి ఇంటికి చేరాలంటే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు గారి విజయంతోనే సాధ్యమవుతుందనే విషయాన్ని ఓటర్లు కు తెలియజేయాలని కోరారు. వాజేడు మండల ఎన్నికల సమన్వయకర్త బోదెబోయిన బుచ్చయ్య మాట్లాడుతూ:తనపై నైతికంగా వ్యాఖ్యలు చేసిన ప్యాకేజీలు ,కమీషన్ల కాంగ్రెస్ నేత తీరును తీవ్రంగా ఖండించారు. భద్రాచలం ప్రాంతానికి ఏమాత్రం అభివృద్ధికి కృషి చెయ్యని కమీషన్లు, ప్యాకేజీ ల బడా నేతలు తిన్న కమిషన్లు లెక్కలన్నీ సరైన సమయంలో బయటపెడతామని నేత బి. బుచ్చయ్య హెచ్చరించారు. బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం అభ్యర్థిగా ఎవరిని నిర్ణయించిన పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే కార్యకర్తగా, శ్రమిస్తూ వస్తున్న తమపై బురద చల్లడం సిగ్గు మాలిన చర్యగా అభివర్ణించారు. భద్రాచలం నియోజకవర్గం లోని వాజేడు మండలంలో బిఆర్ఎస్ పార్టీ విజయాన్ని ఎవరు ఆపలేరని, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ తెల్లం వెంకట్రావు గారిని భారీ మెజార్టీతో గెలిపించుకొని నిబద్ధత గా పనిచేసే తమపై ఆరోపణలు చేస్తున్న నేతలకు చెంపపెట్టు గా ఓట్లు తో సమాధానం చెబుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాజేడు జడ్పిటిసి టి. పుష్పలత, మండల పరిషత్ అధ్యక్షురాలు శ్యామల శారద, మండల బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, బూత్ కమిటీ సభ్యులు తదితరులు తో పాటు మండలంలోని 17 పంచాయతీల నుండి పెద్ద సంఖ్యలో టిఆర్ఎస్ సమావేశంలో కార్యకర్తలు నాయకులు పార్టీ ప్రజాప్రతినిధులు బూత్ స్థాయి కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now