తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు.
– తెలిపిన వెంకటాపురం కాంగ్రెస్ నేతలు.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి, కాంగ్రెస్ సిఎల్పి లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎన్నికైన, కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ములుగు జిల్లా నూగూరు వెంకటా పురం మండల కాంగ్రెస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్రలు, పార్టీ ఉద్యమాలు, ఆందోళనల కార్యక్రమాలలో, కాంగ్రెస్ పార్టీ అధినేత కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి, మెలిసి పాదయా త్రలు, ఆందోళనలో పాల్గొన్న వెంకటాపురం మండల కాంగ్రెస్ సీనియర్ నేత, వెంకటాపురం పిఎసిఎస్ చైర్మన్ చిడెం మోహన్ రావు, వెంకటాపురం మండల పరిషత్ ఉపాధ్యక్షులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, సీనియర్ నాయకులు ఎడ్ల క్రాంతి నాయుడు, రమేష్,చిడెంశివ ,పార్టీ ప్రజాప్రతినిదు లు ఇంకా పలువురు నాయకులు,కార్య కర్తలు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ,కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అలనాటి కాంగ్రెస్ పార్టీ ఉద్యమా ల్లో, రేవంత్ రెడ్డి తో కలిసి మెలిసి పాల్గొన్న ఫోటోలను ఈ సందర్భంగా శుభాకాంక్షలు సందేశంలో, ప్రకటనలో కాంగ్రెస్ నాయకులు విడుదల చేసి , మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా కాబోయే ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానాలు తూ.చా. తప్పకుండా అమలు చేసి ప్రజాభిమానం పొందే విధంగా తామంతా,కార్యకర్తలు గా పార్టీ స్సనికులుగా సి.ఎం. రేవంత్ రెడ్డి సైనికులుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందే విధంగా కృషి చేసి ,నూతన కాంగ్రెస్ ప్రభుత్వం, కాబోయో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గానికి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే విధంగా, భద్రాచలం నియోజకవర్గం లోని వెంకటాపురం మండలంలో కృషి చేస్తామని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు శుభాకాంక్షలు ప్రకటనలో తెలిపారు.
1 thought on “తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు. ”