జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికైన లిటిల్ ఫ్లవర్ విద్యార్థులు
తెలంగాణ జ్యోతి, ములుగు ప్రతినిధి : జాతీయస్థాయి రూరల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆర్.జి.ఎఫ్.ఐ కబడ్డీ, ఖోఖో పోటీలకు లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ శెల్మ కురియాకోస్ , పి.ఈ.టి బస్వోజు రమణాచారి తెలిపారు. వరంగల్ జిల్లాలో ఈనెల 4,5 న జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో అండర్-14 కబడ్డీ బాలుర విభాగంలో ప్రథమ స్థానం, అండర్ -14 ఖోఖో బాలికల విభాగంలో ద్వితీయ స్థానాన్ని కైవశం చేసుకున్నారు. ఈ క్రీడలలో బాలురు తిప్పాని అభిలాష్, బి.హర్షిత్, యశ్వంత్, రామకృష్ణ, సిద్దార్థ్, అర్జున్,రాఘవీన్, శివమణి, అశ్విన్, రామ్ చరణ్, బాలికలు నాగమల్లిశ్వరి ,శ్రీవిద్య, తేజశ్రీ,అమూల్య, కీర్తన, వైశాలి, సిరిచందన,మనిచందన, పాల్గొని అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి జట్టు లో తెలంగాణ రాష్ట్రం తరుపున లిటిల్ ఫ్లవర్ విద్యార్థులు స్థానం దక్కించుకున్నారని ఈ సంద్భంలో తెలియజేశారు. జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థులను పాఠశాల కరస్పాడెంట్ సిస్టర్ రేజిచకో, సిస్టర్ గ్రేస్, మెడల్స్ అందించి అభినందించారు . అదేవిధంగా గోవాలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని జాతీయ స్థాయి జట్టులో స్థానం సంపాదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కృష్ణ, లక్ష్మణ్,మధుసూధనాచారి,పద్మ, అఫ్రీన బేగం,రహీమ, తదితరులు పాల్గొన్నారు..