చిన్నారిని ఆశీర్వదించిన వాజేడు ప్రెస్ క్లబ్ పాత్రికేయులు

Written by telangana jyothi

Published on:

చిన్నారిని ఆశీర్వదించిన వాజేడు ప్రెస్ క్లబ్ పాత్రికేయులు

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : వాజేడు సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ దినపత్రిక జర్నలిస్టు తిప్పనపల్లి రాజు మాలాశ్రీ దంపతుల కుమార్తె శ్రీ రస్తు చిరంజీవి, చిన్నారి దుర్గ కళ్యాణి ల నూతన వస్త్రాలంకరణ వేడుకలకు సోమవారం పలు వురు హాజరై చిరంజీవి చిన్నారులను ఆశీర్వదించారు. ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు  గ్రామంలో జరిగిన తోటి జర్నలిస్టు అయిన తిప్పనపల్లి మాలశ్రీ – రాజు దంపతుల కుమార్తెల నూతన వస్త్రాలంకరణ వేడుకలకు మండలంలోని తెలంగాణ ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు అందరూ హాజరై చిన్నారులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వాజేడు మండల టిఆర్ఎస్ నాయ కులు మోహన్ రావు తో పాటు పలువురు ప్రముఖులు హాజరై చిరంజీవి చిన్నారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు తిప్పన పల్లి రాజు  దంపతులు  తమ కుమార్తె శుభ కార్యానికి హాజరై ఆశీర్వదించినందుకు నమస్కారాలతో వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now